Hyderabad: పైకేమో చాక్లెట్ బాక్సులు.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్

హైదరాబాద్‌లో డ్రగ్‌ స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఏదో ఒక ప్రాంతం నుంచి తీసుకొచ్చి సిటీలో విక్రయించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇటీవల కొద్దిరోజులపాటు హైదరాబాద్‌కు రావాలంటే వణికిపోయిన డ్రగ్‌ స్మగ్లర్లు.. మళ్లీ తమ దొంగ తెలివితేటలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా.. హైదరాబాద్‌లో..

Hyderabad: పైకేమో చాక్లెట్ బాక్సులు.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్
Cereal Box
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 02, 2024 | 10:00 AM

తెలంగాణ నార్కోటిక్‌ అధికారులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నా.. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ దందాలు మాత్రం ఆగడంలేదు. డ్రగ్‌ స్మగ్లర్లు ఏదో ఒక రూపంలో మత్తు పదార్థాలతో హైదరాబాద్‌ మహానగరంలో వాలిపోతూనే ఉన్నారు. దాంతో.. హైదరాబాద్‌లో వరుసగా డ్రగ్స్‌ ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా.. ఒక్కరోజే హైదరాబాద్‌లో రెండు చోట్ల డ్రగ్స్‌ భారీగా పట్టుబడడం షాకిస్తోంది. హైదరాబాద్‌ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. దాదాపు 7 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

ఇవి కూడా చదవండి

బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేసిన డీఆర్ఐ అధికారులు.. వారిపై అనుమానంతో చెక్‌ చేశారు. చెక్-ఇన్ లగేజీని క్రమపద్ధతిలో వెతకగా చాక్లెట్ ప్యాకెట్లలో 13 వాక్యూమ్ ప్యాకెట్లు బయటపడ్డాయి. దానిలో.. ఎండు గంజాయి రూపంలోనున్న హైడ్రోపోనిక్ వీడ్‌ లభ్యమైంది. ఇద్దరిపై ఎన్టీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

మరోవైపు… హైదరాబాద్‌ చందానగర్‌లోనూ డ్రగ్స్‌ దొరికాయి. రాజస్థాన్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చిన తన ఫ్రెండ్‌ను రూపారామ్‌ అనే వ్యక్తి స్వయంగా పోలీసులకు పట్టించాడు. రాజస్థాన్‌ నుంచి వచ్చిన తన బంధువు కృష్ణారామ్‌ వ్యవహారశైలిపై రూపారామ్‌కు అనుమానం రావడంతో చెక్‌ చేయగా డ్రగ్స్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దాంతో.. సీక్రెట్‌గా టీజీ న్యాబ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణారామ్‌ నుంచి సుమారు 150 గ్రాముల MDMA డ్రగ్‌ ప్యాకెట్ల స్వాధీనం చేసుకున్నారు. ఇక.. నిందితుడు కృష్ణారామ్‌.. మధ్యప్రదేశ్‌కు చెందిన సమీర్‌ఖాన్‌, రాజస్థాన్‌ వాసి లూథరామ్‌ దగ్గర కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు పోలీసులు. అలాగే.. హైదరాబాద్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులకు సప్లయ్‌ చేసేందుకు తెచ్చినట్లు వెల్లడించారు.

ఇది చదవండి: బాబోయ్.! 5 స్టాప్‌లు, 11 గంటలు.. ఈ వందేభారత్ రైలు రూటే సపరేటు

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే