Telangana Elections : దసరా బొనాంజా.. డీజేలు, మందు, విందు.. అన్నీ ఫ్రీ..!
రండి బాబు రండి.. దసరా బొనాంజా ఆఫర్.. యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. ఆధార్ కార్డులు ఇవ్వండి.. దసరా నజరాణాలు తీసుకెళ్లండి.. ఇది ప్రస్తుతం తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న తంతు.. మహిళలైతే బతుకమ్మ సంబరాలకు డీజే ఫ్రీ.. పురుషులైతే మందు విందు, గ్రూపు కట్టి వస్తే 45 మందికి ఒక యేట పోతు.. ఈ స్థాయిలో జరుగుతోంది అక్కడ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన. ఓటర్ మహాశయులను తమ బుట్టలో వేసుకునేందుకు అక్కడ భారీగానే ముడుపులు ముడుతున్నాయట.

రండి బాబు రండి.. దసరా బొనాంజా ఆఫర్.. యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. ఆధార్ కార్డులు ఇవ్వండి.. దసరా నజరాణాలు తీసుకెళ్లండి.. ఇది ప్రస్తుతం తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న తంతు.. మహిళలైతే బతుకమ్మ సంబరాలకు డీజే ఫ్రీ.. పురుషులైతే మందు విందు, గ్రూపు కట్టి వస్తే 45 మందికి ఒక యేట పోతు.. ఈ స్థాయిలో జరుగుతోంది అక్కడ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన. ఓటర్ మహాశయులను తమ బుట్టలో వేసుకునేందుకు అక్కడ భారీగానే ముడుపులు ముడుతున్నాయట. ఎన్నికల సమయం దసరా పండుగ రావడంతో ఈ పండుగను వీలైనంత క్యాష్ చేసుకోవాలన్న ఆత్రుతతో అక్కడి అధికార పార్టీ కార్యకర్తలు , సీనియర్ నేత అత్యుత్సహంతో తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారట. ఆ నియోజక వర్గంలోని ఓ మూడు మండలాల్లో అయితే ఇప్పటికే పంపకాలు కూడా పూర్తి చేసి ఆధార్ కార్డ్ డాటాను యథేచ్ఛగా అక్రమంగా వాడేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.. ఇంతకీ ఏంటా నియోజకవర్గం.. ఎక్కడీ దసరా తాయిలాల కథ.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దసరా పండగ రావడంతో ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు బతుకమ్మ సంబరాలను అంబరంగా చేస్తామంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు లోకల్ లీడర్లు. ఈ ఆపర్లను అక్కడి అధికార పార్టీ కింది స్థాయి నేతలు.. అదిష్టానం దృష్టిలో పడాలన్న అత్యుత్సహంతో నజారానాల ప్రకటన చేస్తున్నారంట. నియోజక వర్గం లోని బీమారం మండలంలో ఓ సీనియర్ నేత మండల స్థాయి నుండి గ్రామీణ స్థాయి వరకు 45 మంది సభ్యులు గ్రూప్ కట్టి వస్తే బతుకమ్మ సంబరాల్లో భాగంగా బతుకమ్మ నిమజ్జనానికి డీజేను బహుమతిగా ఇస్తానంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారట. ఇందుకు చేయాల్సిందల్లా తమ వద్ద ఉన్న ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు, ఓటర్ ఐడీలు తమకు అప్పగిస్తే సరిపోతుందంటూ చెప్తున్నారంట.
కేవలం మహిళలకు మాత్రం కాదు పురుషులకు సైతం దసరా బొనాంజా ఆఫర్లు ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారంట కారు పార్టీ నేతలు. ఇందులో భాగంగా తమ పార్టీకి ఓటేస్తామని ప్రతిజ్ఞ చేస్తే వాడకో మేక పోతును కొనిస్తామంటూ బంపర్ ఆపర్లు ప్రకటిస్తున్నారంట కారు పార్టీలో కాకలు తీరిన సీనియర్ నేతలు. అధికార పార్టీ నేతల పేర్లు, వాళ్లు ఓటర్లకు గిఫ్టులు ఇస్తున్నట్టు ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ తతంగానంత ఆ పార్టీకి సంబంధించిన మరో వర్గం నేతలే బయట పెట్టినట్లుగా కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దీంతో ఎన్నికల అధికారులు చెన్నూర్ నియోజకవర్గంలోని భీమారం, జైపూర్, మందమర్రి, చెన్నూర్, కోటపల్లి మండలాల మీద ఫోకస్ పెట్టి నాయకుల మీద నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ డీజే లకు సంబంధించిన వ్యవహారాన్ని కట్టడి చేసేందుకు ఎన్నికలకు సంబంధించిన ఓ టీమ్ రంగంలోకి దిగినట్లు ప్రచారం సాగుతోంది. దసరా బొనాంజా తాయిలాల కథ ఎన్నికల నాటికి ఎలా మలుపు తిరుగుతుందో.. ఎన్నికల అధికారులు ఈ తాయిలాలను ఎలా కట్టడి చేస్తారో.. కేసులు నమోదు చేస్తారా లేదో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
