Telangana: గుప్తనిధుల కోసం పిల్లి కళ్ల బాలుడితో పూజలు.! కట్ చేస్తే.. సీన్ సితారయ్యింది..
Telangana News: గుప్తనిధుల కోసం ఓ పిల్లి కళ్ల బాలుడ్ని కిడ్నాప్‌కు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గుప్తనిధుల కోసం పిల్లి కళ్ల బాలుడితో క్షుద్ర పూజలు చేయిస్తే నిధుల ఆచూకీ దొరుకుతుందని అత్యాశతో కిడ్నాప్‌కు యత్నించగా.. గ్రామస్తులు జాగ్రత్త పడడంతో.. నిందితుల ప్లాన్ కాస్తా బెడిసి కొట్టింది. ఈ ఘటన కొద్దిరోజుల క్రితం జరగ్గా..

పెద్దపల్లి జిల్లా, అక్టోబర్ 17: గుప్తనిధుల కోసం ఓ పిల్లి కళ్ల బాలుడ్ని కిడ్నాప్‌కు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గుప్తనిధుల కోసం పిల్లి కళ్ల బాలుడితో క్షుద్ర పూజలు చేయిస్తే నిధుల ఆచూకీ దొరుకుతుందని అత్యాశతో కిడ్నాప్‌కు యత్నించగా.. గ్రామస్తులు జాగ్రత్త పడడంతో.. నిందితుల ప్లాన్ కాస్తా బెడిసి కొట్టింది. ఈ ఘటన కొద్దిరోజుల క్రితం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన 15 సంవత్సరాల సాయి అనే పిల్లికండ్ల బాలుడిని గుప్త నిధుల తవ్వకాల కోసం క్షుద్ర పూజలు నిర్వహించేందుకు నలుగురు సభ్యుల ముఠా మూడు రోజుల క్రితం యత్నించింది. ముందుగా ముఠా సభ్యులు దొంగతొట్టి గ్రామానికి చెందిన వ్యక్తిని ఆశ్రయించి పిల్లి కళ్ల బాలుడి ఆచూకీ తెలుసుకుని కుటుంబ సభ్యులను క్షుద్ర పూజలకు సహకరించాల్సిందిగా పేర్కొన్నారు. దీనికి బాలుడి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో కరీంనగర్‌కు చెందిన ముగ్గురు ముఠా సభ్యులు ఆటోలో పాలితం గ్రామానికి వచ్చి పిల్లి కళ్ల బాలుడి కిడ్నాప్‌కు యత్నించారు.
అయితే ఈ విషయాన్ని గ్రామస్తులు గ్రహించి ఎదురు తిరగడంతో ఆటోతో సహా నిందుతులు చటుక్కున పారిపోయారు. గ్రామస్తులు ద్వారా ఆలస్యంగా సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుప్త నిధుల తవ్వకాల కోసం పిల్లి కన్నుల బాలుడిని క్షుద్ర పూజల్లో కూర్చోబెట్టు్కోవాలనుకున్న ముఠా సభ్యుల్లోని ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న ముగ్గురు సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సత్యసాయి జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల కలకలం..
మరోవైపు ఇలాగే గతవారం గుప్త నిధుల కోసం అర్ధరాత్రి తవ్వకాలు జరిపారు కేటుగాళ్లు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని అమరాపురం మండలం పేలుబండ చెరువు సమీపంలో జరిగింది. అర్ధరాత్రి వేళ గుప్తనిధుల కోసం జేసీబీతో తవ్వకాలు జరిపారు కేటుగాళ్లు. ఇక ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితులు అర్ధరాత్రి గ్రామ శివారులో జేసీబీతో డ్రిల్లింగ్, తవ్వకాలు చేయడంతో.. ఆ శబ్దాలు గ్రామస్థుల కంటి మీద కునుకు లేకుండా చేశాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..