CM KCR: ఆత్మహత్యలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నా.. వాళ్లను నమ్మొద్దు.. సిరిసిల్ల సభలో సీఎం కేసీఆర్
Sircilla BRS Public Meeting: రైతుల కోసమే ధరణిని తీసుకువచ్చాం.. సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం.. మోసపూరిత మాటలు నమ్మొద్దు అంటూ భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ టార్గెట్ గా నిప్పులు చెరిగారు.

Sircilla BRS Public Meeting: రైతుల కోసమే ధరణిని తీసుకువచ్చాం.. సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం.. మోసపూరిత మాటలు నమ్మొద్దు అంటూ భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. చేనేతల కోసమే బతుకమ్మ చీరలు తీసుకొచ్చామని.. కొందరు రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఓట్ల అబద్దాలు చెప్పలేదని.. ఇచ్చిన హామీలను అమలు చేసి చూపుతున్నామని కేసీఆర్ పేర్కొ్నారు. మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీయే అధికారం చేపడుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.
సిరిసిల్లలో ఒకప్పుడు ఆత్మహత్యలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 70 ఏళ్ల రాజకీయ చరిత్రలో సిరిసిల్లలో ఎన్నో సార్లు పర్యటించానని, సమైక్య పాలనలో నాశనం అయిపోయిందంటూ కేసీఆర్ పేర్కొన్నారు. అప్పర్ మానేరు ప్రాజెక్టుతో జలధార పరుగులు పెడుతున్నదంటూ పేర్కొన్నారు. నిండు కుండలా మారి మానేరు ప్రాజెక్టు సిరిసిల్లను సస్యాశ్యామలం చేసిందన్నారు. సిరిసిల్లలో ఎంతో అభివృద్ధి జరిగిందంటూ పేర్కొన్నిరు. సిరిసిల్లలో ఒకప్పుడు చేనేతల ఆత్మహత్యలు ఉండేవని.. చేనేతల అభివృద్ధి కోసం కేటీఆర్ ఎంతో చేశారంటూ అభినందించారు.
24 గంటల కరెంట్ విషయంపై మరోసారి కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ అంటూ చెప్పిందని.. మోసపూరిత హామీలను నమ్మొద్దంటూ కేసీఆర్ పేర్కొన్నారు. ఓట్ల కోసం మోసపూరిత హామీలతో వస్తారని.. కాంగ్రెస్ ను నమ్మవద్దంటూ సూచించారు. మరికొందరు మతాల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తారని జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. మరోసారి గులాబీ పార్టీని ఆశీర్వదించాలంటూ కేసీఆర్ కోరారు.
అంతకుముందు మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ఇది చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం అంటూ పేర్కొన్నారు. మళ్లీ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందంటూ ధీమా వ్యక్తంచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..