Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan Elections 2023: ఎలక్షన్ డేట్‌కే ఎసరు పెట్టిన పెళ్లిళ్లు.. ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. అసలు ఏం జరిగిందంటే..

Rajasthan Elections 2023: కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూ్‌ల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. నవంబర్‌ 23 బదులు నవంబర్‌ 25న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది.

Rajasthan Elections 2023: ఎలక్షన్ డేట్‌కే ఎసరు పెట్టిన పెళ్లిళ్లు.. ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. అసలు ఏం జరిగిందంటే..
Rajasthan Elections
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 11, 2023 | 6:23 PM

Rajasthan Elections 2023: కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూ్‌ల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. నవంబర్‌ 23 బదులు నవంబర్‌ 25న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ యథాతథంగా ఉంటుందని స్పష్టంచేసింది. నవంబర్‌ 23న రాష్ట్రవ్యాప్తంగా చాలా పెళ్లిళ్లు ఉన్నాయని, పోలింగ్‌ తేదీని మార్చాలని రాజకీయ పార్టీలతో పాటు చాలా మీడియా సంస్థలు ఈసీకి విజ్ఞప్తి చేశాయి. దీంతో ఎన్నికల షెడ్యూల్‌ను మారుస్తునట్టు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఓటింగ్ తేదీలో మార్పు కోసం వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలిపింది. కొత్త షెడ్యూల్ ప్రకారం 25న (శనివారం) ఓటింగ్ జరుగుతుందని పేర్కొంది.

23న శుభ మూహుర్తం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లు ఉన్నాయి. ఆ తేదిన వివాహాలు నిర్వహించేందుకు చాలా కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో 23న రాజస్థాన్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో.. దీనిపై చాలా కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. దీంతో రాజస్థాన్ ఎన్నికల తేదీని (నవంబర్ 23) మార్చాలని పాలికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ పీపీ చౌదరి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రంలో పెళ్లిళ్ల దృష్ట్యా ఓటింగ్ తేదీని మార్చాలంటూ కొన్ని సంఘాలు, సమాజిక సంస్థలు కూడా ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీంతో పోలింగ్ తేదీని మారుస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

కాగా.. రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 14తో ముగుస్తుంది. రాజస్థాన్‌లో ప్రస్తుతం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బహుజన్ సమాజ్ పార్టీ, స్వతంత్ర ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 73 స్థానాలను గెలుచుకుంది. అయితే.. ఈ సారి మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్.. మళ్లీ పట్టు సాధించి అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి.

రాజస్థాన్ (నవంబర్ 25) తోపాటు.. మధ్యప్రదేశ్ (నవంబర్ 17), ఛత్తీస్‌గఢ్ (నవంబర్ 7 – 17), మిజోరాం (నవంబర్ 7), తెలంగాణ (నవంబర్ 30) లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ రాష్ట్రాల ఎన్నికలను 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అన్ని ప్రధాన పార్టీలు సెమీఫైనల్‌గా పరిగణిస్తూ.. ఎత్తుకుపైఎత్తులు వేస్తూ దూసుకెళ్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..