MP Komatireddy: సీఎం పదవి అవసరం లేదు.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయన రూటు సెపరేటు. పార్టీ వ్యవహారాలపై దాపరికం లేకుండా మాట్లాడుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

MP Komatireddy: సీఎం పదవి అవసరం లేదు.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
MP Komatireddy Venkat Reddy (File Photo)
Follow us
Janardhan Veluru

|

Updated on: May 17, 2023 | 3:13 PM

కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయన రూటు సెపరేటు. పార్టీ వ్యవహారాలపై దాపరికం లేకుండా మాట్లాడుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. తాను సీఎం అభ్యర్థి రేసులో లేనని, తనకు సీఎం పదవి అవసరం లేదని ఆయన ప్రకటించారు. అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరే లేదని చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్‌లోనే వర్గ పోరు ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. నల్లగొండలో టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ ఎన్నికల ఫలితాల తర్వాత మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయంతో పార్టీ హై కమాండ్ సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావంతో పార్టీలో నూతన ఉత్సవం వచ్చిందని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. స్టార్ క్యాంపెయినర్ హోదాలో పొంగులేటి, జూపల్లితో కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ఫోన్ లో మాట్లాడినట్లు తెలిపారు. రైతులు, నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమన్నారు.

కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై కోమటిరెడ్డి గతంలోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల క్రితం సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొన్న కోమటిరెడ్డి.. తెలంగాణ సీఎం అభ్యర్థిగా దళిత వ్యక్తిని ప్రకటించాలని డిమాండ్ చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయమై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా తాను చర్చించినట్లు అప్పట్లో కోమటిరెడ్డి తెలిపారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే దళిత వ్యక్తిని సీఎం చేయాలని ఆయన కోరారు.  అయితే రేవంత్ రెడ్డి సీఎం కాకుండా అడ్డుకునే దురుద్దేశంతోనే కోమటిరెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు సొంత పార్టీ నేతలే ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!