AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఛీ..ఛీ అసలు వీడు మనిషేనా.. మద్యం కోసం డబ్బుల్లేవని.. మనవడ్నే అమ్మేశాడు

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తాగుడు కోసం తన మనువడినే అమ్మేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే హాకీంపేట్ లో ఖలీల్(40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

Hyderabad: ఛీ..ఛీ అసలు వీడు మనిషేనా.. మద్యం కోసం డబ్బుల్లేవని.. మనవడ్నే అమ్మేశాడు
Alcohol
Aravind B
|

Updated on: May 17, 2023 | 1:47 PM

Share

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తాగుడు కోసం తన మనువడినే అమ్మేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే హాకీంపేట్ లో ఖలీల్(40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసగా మారిన ఖలీల్ తన భార్యతో, కుటుంబ సభ్యులతో తరచూ గొడవలు పడే వాడు. నిత్యం మద్యం సేవిస్తూ సోమరిగా తిరుగుతుంటాడు. తాగడానికి డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను వేధించేవాడు. వారు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మి మరీ.. మద్యం తాగేవాడు. ఈ క్రమంలో ఖలీల్ కుమార్తె ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. అలానే ఇటీవలే మగబిడ్డకు జన్మిచ్చింది. ఇదే సమయంలో రెండు రోజుల క్రితం ఖలీల్ డబ్బుల కోసం ఇంట్లో వారితో గొడవలు పడ్డాడు. వారు డబ్బులు లేవని చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యాడు.

ఇంట్లో వాళ్లు పనుల్లో ఉండగా .. గుట్టు చప్పుడు కాకుండా మనవడిని ఖలీల్ ఎత్తుకెళ్లాడు. చివరికి ఆ బాబును అమ్మేసి.. వచ్చిన డబ్బులతో మద్యం సేవించాడు. ఇదే సమయంలో బాబు కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఎంతవరకు వెతికిన కొడుకు కనిపించడంలేదని ఖలీల్ కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. తన మనువడ్ని అమ్మేసినట్లు ఖలీల్ అంగీకరించాడు. అతను చెప్పిన ఆధారంగా చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే మద్యం డబ్బుల కోసం సొంత మనవడినే అమ్మిన ఖలీల్‌పై స్థానికులు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి