WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు మరో షాకింగ్ న్యూస్.. టీమిండియాను భయపెడుతోన్న ఫొటోలు..
IND vs AUS WTC Final 2023: జస్ప్రీత్ బుమ్రాతో పాటు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో పాల్గొనడం లేదు. అదే సమయంలో ఓవల్ మైదానంలో టీమిండియాను భయపెట్టే ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి.
IND vs AUS WTC Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా తలపడనున్నాయి. జూన్ 7 నుంచి ఓవల్ మైదానంలో ఇరు జట్లు పోరాడనున్నాయి. అయితే, ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు, కష్టాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రాతో పాటు, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భాగం కావడం లేదు. అదే సమయంలో ఇప్పుడు ఓవల్ మైదానం నుంచి వస్తున్న ఫొటోలు భారత జట్టుకు బ్యాడ్ న్యూస్‌లు అందిస్తున్నాయి.
పిచ్ ఫొటోలు చూస్తే కష్టంగానే..
పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉందని, ఇది టీమ్ ఇండియాకు మంచి సంకేతం కాదని సోషల్ మీడియాలో ఫొటోలు తెగ వైరల్ అవుతన్నాయి. ఓవల్ పిచ్‌పై పచ్చగడ్డి ఉండడం వల్ల ఆస్ట్రేలియా జట్టు లాభపడుతుందని, రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్‌ఇండియాకు ఇబ్బందులు పెరుగుతాయని క్రికెట్ అనుభవజ్ఞులు భావిస్తున్నారు. అయితే మ్యాచ్‌కు ముందు పిచ్‌లో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ, ప్రస్తుత ఫొటోలు మాత్రం టీమ్ ఇండియాకు మింగుడు పడడం లేదు.
ఈసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను టీమిండియా కైవసం చేసుకోగలదా?
విశేషమేమిటంటే, భారత జట్టు 2021లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే న్యూజిలాండ్‌పై ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అదే సమయంలో ఈసారి ఆస్ట్రేలియా సవాల్ టీమ్ ఇండియా ముందు ఉండనుంది. అయితే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనలలో మూడు ప్రధాన మార్పులు చేసింది. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ సిఫార్సుల తర్వాత, చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్ పొందింది.
@ICC WTC pitch 23 days before @BCCI take on @CricketAus @KiaOvalEvents ! #cricket @TheBarmyArmy @thebharatarmy @The_Richies pic.twitter.com/GcwWItvIzs
— Michael Jacobs (@mjacobscoach) May 16, 2023
ఐసీసీ నిబంధనలలో ఎలాంటి మార్పులు చేసిందంటే?
1- ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేటపుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి.
2- ఫాస్ట్ బౌలింగ్ స్టంప్‌లకు వ్యతిరేకంగా వికెట్ కీపింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి.
3- వికెట్ ముందు ఉన్న ఫీల్డర్లు బ్యాట్స్‌మన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, వారు హెల్మెట్ ధరించడం తప్పనిసరి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..