LSG vs MI 1st Innings Highlights: వరుస బౌండరీలతో మార్కస్ స్టోయినిస్ ఊచకోత.. ముంబై టార్గెట్ 178
Lucknow Super Giants vs Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రస్తుత సీజన్‌లో 63వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ లక్నో సూపర్‌జెయింట్స్ (LSG) మధ్య ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ ముందు 178 పరుగుల టార్గెట్ నిచలింది. మార్కస్ స్టోయినిస్ తన కెరీర్‌లో […]

Lucknow Super Giants vs Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రస్తుత సీజన్‌లో 63వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ లక్నో సూపర్‌జెయింట్స్ (LSG) మధ్య ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ ముందు 178 పరుగుల టార్గెట్ నిచలింది. మార్కస్ స్టోయినిస్ తన కెరీర్‌లో 7వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. లక్నోలోని స్లో పిచ్‌పై మార్కస్ స్టోయినిస్ తుఫాను బ్యాటింగ్ చేశాడు. స్టోయినిస్ కేవలం 47 బంతుల్లో అజేయంగా 89 పరుగులు చేశాడు. ఈ సమయంలో స్టోయినిస్ బ్యాట్ నుంచి 4 ఫోర్లు, 8 సిక్సర్లు వచ్చాయి.




కెప్టెన్ కృనాల్ పాండ్యా 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గాయపడి రిటైర్ అయ్యాడు. అంతకుముందు పీయూష్ చావ్లా క్వింటన్ డి కాక్ (16 పరుగులు) వికెట్ తీశాడు. ప్రేరక్ మన్కడ్ (0), దీపక్ హుడా (5 పరుగులు)లను జాసన్ బెహ్రెన్ డార్ఫ్ అవుట్ చేశాడు.
6⃣.4⃣4⃣6⃣4⃣
Marcus Stoinis at his best ??
Follow the match ▶️ https://t.co/yxOTeCROIh #TATAIPL | #LSGvMI pic.twitter.com/RSovpw3nPp
— IndianPremierLeague (@IPL) May 16, 2023
ఇరు జట్లు:
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్, ఆకాష్ మధ్వల్.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, స్వప్నిల్ సింగ్, మొహ్సిన్ ఖాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




