New Parliament Inauguration: త్వరలోనే కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం..! ముహూర్తం కూడా ఫిక్స్.. ఎప్పుడంటే..?

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్‌ అయింది. భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వ చిహ్నంగా ఉండనున్న ఈ భవనాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మోదీ సర్కార్ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని..

New Parliament Inauguration: త్వరలోనే కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం..! ముహూర్తం కూడా ఫిక్స్.. ఎప్పుడంటే..?
New Parliament Opening
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 17, 2023 | 5:30 AM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్‌ అయింది. భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వ చిహ్నంగా ఉండనున్న ఈ భవనాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మోదీ సర్కార్ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. ఈ మేరకు మే నెల 28న పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి వినియోగిస్తున్న పార్లమెంట్ భవనం పాతది కావడంతో మోదీ ప్రభుత్వం దాని స్థానంలో కొత్తది నిర్మిస్తోంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ భవనం ఈ నెలలోనే ప్రారంభోత్సవం జరుపుకోనుంది.

అయితలే ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ భవనాన్ని దాదాపు 970 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పార్లమెంట్ నాలుగు అంతస్తులతో ఉంటుంది. ఇందులో సుమారు 1,224 మంది ఎంపీలు ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఇందులో భోజన గదులు, విస్తారమైన పార్కింగ్‌ స్థలాలు ఉన్నాయి. ఇది భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వ చిహ్నంగా ఉండనుంది. ఈ కొత్త పార్లమెంట్‌ నిర్మాణంలో జ్ఞాన్‌ ద్వార్‌, శక్తి ద్వార్‌, కర్మ ద్వార్‌ అనే మూడు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వాటిని వీఐపీలు, సందర్శకులు, అధికారుల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలుగా కేటాయించారు.

కాగా, 2020 డిసెంబర్‌లో మోదీ కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను శంకుస్థాపన చేయగా 2021 అక్టోబర్ 1 నుంచి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనంలో మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్‌తో పాటుగా దేశంలో ప్రధాన మంత్రులుగా చేసిన వారి ఫొటోలను పొందుపరచనున్నారు. పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు జూలైలో కొత్త భ‌వ‌నంలో జ‌రుగుతాయ‌ని స‌మాచారం. 2014 మే 26న భారత ప్రధానిగా మోదీ మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనకు గుర్తుగా బీజేపీ దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ భవనం ప్రారంభం కూడా ఉండబోతోంది. ఈ ప్రాంభోత్సవంలో భాగంలో మోదీ తొమ్మిదేళ్ల ప్రభుత్వానికి గుర్తుగా బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ నెల రోజుల పాటు భారీగా ప్రత్యేక ప్రచార ర్యాలీలను నిర్వహించేందుకు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.