ఆర్టీసీలో ప్రైవేట్ డ్రైవర్ బాగోతం.. బాధితుడి ఫిర్యాదుతో కేటుగాడి గుట్టురట్టు.. ఏమైందంటే..

ప్రయాణికుల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. అధికారులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆర్టీసీ ప్రయాణమంటే ప్రయాణికులు భయపడేలా చేస్తున్నారు. తక్కువలో తక్కువ సుమారు 35 ఏళ్లైనా నిండిన వాళ్లు ఉంటారు. కాని కర్రె అనిల్ విషయంలో నిజంగానే అధికారులు బోల్తా పడ్డారా? లేక ముడుపులు ఏమైనా ముట్టాయా? అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఆర్టీసీలో ప్రైవేట్ డ్రైవర్ బాగోతం.. బాధితుడి ఫిర్యాదుతో కేటుగాడి గుట్టురట్టు.. ఏమైందంటే..
Driver Doing Duty With Fake
Follow us

|

Updated on: May 17, 2023 | 12:55 PM

ఆర్టీసీ ప్రయాణం సురక్షితం.. సుఖవంతం అంటూ కొటెన్షన్ వింటుంటాం. కాని మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్టీసీ డిపోలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టం కనిపిస్తుంది. నకిలి డ్రైవింగ్ లైసెన్స్ తో పోస్ట్ కు అప్లై చేసిన పట్టుమని 25ఏళ్లు కూడా నిండని కుర్రాడికి ఆర్టీసీ డ్రైవర్ పోస్ట్ ఇచ్చారు. చిన్న వయ్యస్సులో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వచ్చిందనే సోయ లేకుండా కుర్రాడికి ఆర్టీసీ బస్సు స్టీరింగ్ అప్పజెప్పారు. ప్రయాణికుల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. టీఎస్ ఆర్టీసీ అధికారులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆర్టీసీ ప్రయాణమంటే ప్రయాణికులు భయపడేలా చేస్తున్నారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన కర్రే అనిల్ కుమార్ అదే గ్రామానికి చెందిన చాకలి కృష్ణ డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ చేసి మొబైల్ ఫోన్లో ఎడిట్ చేసి ఆర్టీసీ డ్రైవర్ హోదాలో అద్దె బస్సును రయ్‌రయ్ అంటూ తిప్పేస్తున్నాడు. ఎంచక్కా ఆర్టీసీ డ్రైవర్ హోదాలో విధులు నిర్వహిస్తున్నాడు. 5 నెలలుగా నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ తో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బంది గానీ, ప్రైవేటు బస్సు యజమానికానీ గమనించకుండా నకిలీ డ్రైవర్తో బస్సును నడిపిస్తున్నారు. చివరకు తన డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీకి గురైందని తెలుసుకున్న చాకలి కృష్ణ.. కర్రె అనిల్ ను నిలదీయడంతో అసలు విషయం బట్టబయలైంది.

ఆర్టీసీ డ్రైవర్ అంటే కనీసం హెవీ లైసెన్స్ ఉండి.. తక్కువలో తక్కువ సుమారు 35 ఏళ్లైనా నిండిన వాళ్లు ఉంటారు. కాని కర్రె అనిల్ విషయంలో నిజంగానే అధికారులు బోల్తా పడ్డారా? లేక ముడుపులు ఏమైనా ముట్టాయా? నకిలి డ్రైవర్ విషయంలో అలసత్వం వహించిన అధికారులు, బస్సు ఓనర్ పై ఎలాంటి చర్యలు ఉంటాయనేది తెలియాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..