AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ.. వీడి కక్కుర్తి తగలేయా..? చోరీకి వెళ్లిన దొంగ.. కాస్ట్లీ మందు కనిపించగానే కమిట్‌ అయ్యాడు.. ఇక అంతే..

ఇండియన్ ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత శర్వానంద్ తన కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటున్నారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన ఇంట్లోకి ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఈ క్రమంలోనే ఇంట్లో కనిపించిన నాలుగు ఖరీదైన మద్యం సీసాలను చూసి ఇద్దరూ తాగడం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత ..

వార్నీ.. వీడి కక్కుర్తి తగలేయా..? చోరీకి వెళ్లిన దొంగ.. కాస్ట్లీ మందు కనిపించగానే కమిట్‌ అయ్యాడు.. ఇక అంతే..
Drinking Alcohol
Follow us
Jyothi Gadda

|

Updated on: May 17, 2023 | 12:24 PM

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఓ ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన దొంగోడు.. అక్కడ కనిపించిన ఖరీదైన మందు బాటిల్స్ చూసి కక్కుర్తి పడ్డాడు. అందివచ్చిన అవకాశం చేజారనీవ్వకూడదని భావించాడు.. నచ్చిన బాటిల్స్‌ తీసుకుని ఎంచకా లాంగిచేశాడు..ఇంకేముంది.. ఫుల్ గా తాగేసి బెడ్ రూమ్ లో ఒళ్లు మరచి నిద్రపోయాడు. తరువాత ఇంటి యజమాని ఎంత ప్రయత్నించినా నిద్ర లేవలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

సమాచారం ప్రకారం, నిర్మల కటారి లక్నోలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉంది. ఇండియన్ ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత శర్వానంద్ తన కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటున్నారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన ఇంట్లోకి ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఈ క్రమంలోనే ఇంట్లో కనిపించిన నాలుగు ఖరీదైన మద్యం సీసాలను చూసి ఇద్దరూ తాగడం మొదలుపెట్టారు. ఓ దొంగ అతిగా మద్యం సేవించడంతో అదే మంచంపై పడుకున్నాడు. కుటుంబ సమేతంగా శర్వానంద్ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో సామాన్లు చిందరవందరగా ఉండడంతో పాటు బెడ్‌పై ఓ గుర్తు తెలియని వ్యక్తి నిద్రిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించి దొంగను లేపేందుకు ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా లేవలేనంతా నిద్రపోతున్నాడు. కొంత సేపటికి నిద్ర లేచిన దొంగోడు..చుట్టూ ఉన్న జనాన్ని చూసి.. వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు.

పోలీసులు అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో సహచరుడితో కలిసి దొంగతనానికి వచ్చానని చెప్పాడు. దొంగిలించబడిన వస్తువులన్నింటినీ పట్టుకోవడానికి, అతని సహచరుడు అతనికి అతిగా మద్యం తాగించాడు. దాని కారణంగా అతను ఇక్కడ నిద్రపోయాడు మరియు పట్టుబడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో పాటు పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నారు. విచారణలో దొంగ తన పేరు శారదా నగర్‌లో నివాసముంటున్న సలీం అని వెల్లడించాడు. 10 తులాల బంగారం, 1.5 లక్షల విలువైన 2 కిలోల వెండి, సుమారు 50 వేల విలువైన 40 ఖరీదైన చీరలు, 6 లక్షల రూపాయలతో పాటు ముఖ్యమైన పత్రాలు మాయమైనట్లు బంధువులు తెలిపారు. అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..