New Parliament : కొత్త పార్లమెంట్ ప్రారంభం అప్పుడే..! మోదీ 9 ఏళ్ల పాలనకు గుర్తుగా..
దేశనేతలైన మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ సహా పలువురు ప్రముఖులు, మాజీ ప్రధానుల చిత్రపటాలు పార్లమెంటు భవనంలో కొలువుతీరనున్నాయి. ఈ భవనానికి ఉన్న మూడు ప్రధాన ద్వారాలకు జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అని పేర్లు పెట్టారు. పార్లమెంటులోకి వెళ్లేందుకు..

కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మే 26, 2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ తొలిసారి బాధ్యతలు చేపట్టగా.. మే 30, 2019న రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ యేడు మే 26తో మోదీ అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తవుతుండగా, ఈ తేదీన ప్రభుత్వం 9వ వార్షికోత్సవం జరుపుకోనుంది. ఇదే సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
970 కోట్లు స్వయంగా ప్రధాని మోదీయే. వ్యయంతో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ ఏడాది చివర్లో అదే భవనంలో G-20 స్పీకర్ల సమావేశం నిర్వహించే అవకాశం ఉందని మీడియా నివేదికలు తెలిపాయి. ఈ త్రిభుజాకార పార్లమెంట్ భవనం నిర్మాణం 15 జనవరి 2021న ప్రారంభమైంది. ఇది 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1224 మంది ఎంపీలు కూర్చోగల పార్లమెంట్. దీనికి జ్ఞాన ద్వార, శక్తి ద్వార, కర్మ ద్వార అనే 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఎంపీలు, ఉన్నతాధికారులు, సందర్శకులకు 3 ప్రత్యేక గేట్లు ఉన్నాయి.
ఇది రాజ్యాంగ హాల్ అని పిలువబడే ఒక ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేశారు. ఇది దేశం గొప్ప ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. రాజ్యాంగం అసలు పత్రం కాపీని కూడా ఇక్కడ ఉంచారు. ఇందులో లైబ్రరీ, కమిటీ గదులు, క్యాంటీన్ ఉన్నాయి. మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, దేశంలోని మునుపటి ప్రధాన మంత్రుల చిత్రాలు కొత్త పార్లమెంటు భవనంలో ఉన్నాయి. భవనంలో పనిచేసే సిబ్బంది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ రూపొందించిన కొత్త యూనిఫామ్‌లను ధరిస్తారు. దీంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలోనే జరుగనున్నాయి.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..