AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: కాంగ్రెస్ అలా చేయడం వల్లే గెలిచింది.. బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు

కర్ణాటకలో రసవత్తరంగా మారిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీతో విజయం సాధించింది. కాంగ్రెస్‌కు 135 సీట్లు రాగా.. బీజేపీకి 66 స్థానాల్లో గెలిచింది. అలాగే జేడీఎస్ పార్టీ 19 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే బీజేపీ ఓటమిపై తాజాగా మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు.

Karnataka: కాంగ్రెస్ అలా చేయడం వల్లే గెలిచింది.. బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు
Basavaraj Bommai
Aravind B
|

Updated on: May 17, 2023 | 8:47 AM

Share

కర్ణాటకలో రసవత్తరంగా మారిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీతో విజయం సాధించింది. కాంగ్రెస్‌కు 135 సీట్లు రాగా.. బీజేపీకి 66 స్థానాల్లో గెలిచింది. అలాగే జేడీఎస్ పార్టీ 19 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే బీజేపీ ఓటమిపై తాజాగా మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఎన్నికల సమయం రాగానే బీజేపీ కంటే మందుగానే కాంగ్రెస్ ప్రచారం చేసిందని పేర్కొన్నారు. అలాగే ప్రజలు కూడా ఆ పార్టీ ప్రకటించిన ఉచిత పథకాల పట్ల ఆకర్షితులైనట్లు తెలిపారు. కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీ నిర్ణయాలను కొంచెం ఆలస్యంగా తీసుకుందన్నారు.

బీజేపీ చాలా బహిరంగ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ.. ప్రజలకు సరైన సందేశం ఇవ్వలేకపోయాని తెలిపారు. తాము తీసుకున్న పెద్ద నిర్ణయాలు ప్రజల్లోకి చేరుకోలేకపోయానని పేర్కొన్నారు. అయితే బీజేపీ ఓటింగ్ షేర్ మాత్రం మారలేదని.. జేడీఎస్‌కు కంచుకోటలా ఉండే దక్షిణ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వెళ్లాయని తెలిపారు. జేడీఎస్ నుంచి దాదాపు 5 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు వెళ్లాయన్నారు. అయితే బీజేపీ ఓటమిని తన బాధ్యతగా తీసుకుంటున్నాని.. నాయకుడు అనేవాడు వైఫల్యాన్ని స్వీకరించినప్పుడే ముందుకు వెళ్లగలమని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం మరింత ప్రణాళికలు రూపొందించాలని.. అన్ని స్థాయిల్లో కూడా కొత్తగా ఆలోచనలు చేయాలని.. తమ కార్యకర్తల్లో చైతన్యం నింపాలని పేర్కొన్నారు. వచ్చే ఆరునెలల్లో పరిస్థితులు మారిపోయి.. తమకు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.