MBBS Student: ఫీజు కట్టలేని పరిస్థితిలో వైద్య విద్యార్థిని.. కలెక్టర్‌తో సహా ఉద్యోగులు చేసిన పనికి అందరూ ఫిదా
గుజరాత్‌లోని ఓ వైద్య విద్యార్థిని చదువు కోసం జిల్లా కలెక్టర్ సహా 200 మంది ప్రభుత్వ ఉద్యోగులు చేసిన పనికి అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే భరూచ్ ప్రాంతానికి చెందిన ఆలియాబా అనే వైద్య విద్యార్థిని వడోదరకు చెందిన పారుల్ యూనివర్శిటీలో మెడిసన్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది.
గుజరాత్‌లోని ఓ వైద్య విద్యార్థిని చదువు కోసం జిల్లా కలెక్టర్ సహా 200 మంది ప్రభుత్వ ఉద్యోగులు చేసిన పనికి అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే భరూచ్ ప్రాంతానికి చెందిన ఆలియాబా అనే వైద్య విద్యార్థిని వడోదరకు చెందిన పారుల్ యూనివర్శిటీలో మెడిసన్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. అయితే మొదటి సెమిస్టర్‌కు రూ.7.70 లక్షల ఫీజు కాగా.. ఆమె తల్లిదండ్రులు బ్యాంకు రుణం తీసుకోవడంతో పాటు తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి మరీ ఫీజు చెల్లించారు. అయితే ఇప్పడు ఆలియాబా రెండో సెమిస్టర్ కోసం రూ.4 లక్షలు కట్టమన్నారు.
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆలియాబా కుటుంబానికి ఏం చేయాలో తెలియలేదు. దీంతో సహాయం కోసం ప్రధాని, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్‌లకు లేఖ రాసినట్లు ఆలియాబా తండ్రి అయూబ్ పటేల్ తెలిపారు. అయితే ఈ లేఖకు జిల్లా కలెక్టర్ తుషాక్ సుమేరా స్పందించారు. ఆ విద్యార్థిని పరిస్థితిని తన సహోద్యోగులకు వివరించారు. దీంతో వారంతా ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కలెక్టర్‌తో పాటు తన సహోద్యోగులందరూ కలిసి ఒకరోజు వేతనాన్ని గత ఆదివారం ఆలియాబాకు అందించారు. అలాగే ఆలియాబా వైద్య పూర్తయ్యేవరకు అండగా నిలిచేలా ప్రణాళిక రూపొదింస్తున్నామని కలెక్టర్ తుషార్ సుమేరా పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.