Watch: వర్షం రాని, పిడుగులు పడని.. తగ్గేదేలే..? తల మీద బెడ్లు కప్పుకుని వివాహ విందు..! ఎలాగో మీరూ చూసేయండి..

ఇంకొకరు సంకల్పం ఉన్న చోటే మార్గం ఉంటుందని రాశారు. వీళ్లంతా గొప్ప ఆలోచన చేశారు.. లేదంటే, పెళ్లి కోసం చేసిన చాలా ఆహారం వృధా అయ్యేదని మరికొంతమంది వినియోగదారులు చెప్పారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు వీడియోపై స్పందించారు.

Watch: వర్షం రాని, పిడుగులు పడని.. తగ్గేదేలే..? తల మీద బెడ్లు కప్పుకుని వివాహ విందు..! ఎలాగో మీరూ చూసేయండి..
Wedding Jugaad
Follow us
Jyothi Gadda

|

Updated on: May 17, 2023 | 8:29 AM

సోషల్ మీడియాలో వివాహాలకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి.. కొన్ని మనల్ని నవ్విస్తాయి, మరికొన్ని మనల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో వివాహ వేడుక జరుగుతుండగా భారీ వర్షం కురిసింది. దీంతో పెళ్లి సందడి కాస్త గందరగోళంగా మారింది. కానీ, పెళ్లికి వచ్చిన అతిధులు మాత్రం వర్షంతో పోరాడిన తీరు చూసి జనాలు వీళ్లకు ఫ్యాన్ అయిపోయారు! ఇంతకీ పెళ్లిలో వర్షం పడుతుండగా, ఆ అతిథులు చేసిన హంగామా ఏంటో తెలిస్తే మాత్రం మీరు కూడా అవాక్కవ్వాల్సిందే. ఇలాంటి దేశీ జుగాడ్ మన దేశంలోని ప్రతి మూలలో ఎంత వైరల్ అవుతుందో తెలుసుకోండి.

వైరల్‌ అవుతున్న ఈ వీడియో ప్రకారం ఇక్కడ పెళ్లి వేడుక జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే, జోరున వర్షం కురుస్తున్న వేళ పెళ్లి వేదిక వద్ద భోజనాల కార్యక్రమం జరుగుతున్న తీరును ఈ వైరల్ వీడియోలో చూడొచ్చు! అయితే, ప్రజలు భోజనం కోసం కూర్చునే టైమ్‌లో జోరున వర్షం పడుతోంది. టెట్‌ మీద నుంచి నీళ్లు కిందకు జారిపడుతున్నాయి. దాంతో కొందరు చెల్లా చెదురుగా పారిపోయారు. కానీ, చాలా మంది మాత్రం ఆ పక్కనే ఉన్న మంచాలు, బెడ్లను ఎత్తుకుని తలలపై పెట్టుకున్నారు. వరుసగా కూర్చున్న జనాలు తలపై బెడ్‌ పెట్టుకుని తినటం మొదలు పెట్టారు. ఈ ఫన్నీ సీన్‌ మొత్తాన్ని రికార్డ్‌ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ క్లిప్‌ని సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయడానికి ఇదే కారణం.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by @avi_kumawat_88

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @avi_kumawat_88 ద్వారా పోస్ట్ చేయబడింది. ఈ వార్తను ఇప్పటికే దాదాపు 7 మిలియన్ల వీక్షణలు, 3 లక్షల కంటే ఎక్కువ లైక్‌లను సాధించింది. అంతేకాదు..వినియోగదారులు.. తమ హృదయపూర్వక మాటలతో వీడియోకి కామెంట్స్‌ చేశారు..ఒక నెటిజన్‌ స్పందిస్తూ… ఏం జరిగినా, సరే.. తిండి తినటం మాత్రం వదిలిపెట్టేది లేదంటున్నారు. ఇంకొకరు సంకల్పం ఉన్న చోటే మార్గం ఉంటుందని రాశారు. వీళ్లంతా గొప్ప ఆలోచన చేశారు.. లేదంటే, పెళ్లి కోసం చేసిన చాలా ఆహారం వృధా అయ్యేదని మరికొంతమంది వినియోగదారులు చెప్పారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు వీడియోపై స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..