మందుబాబులు జర భద్రం.. ఇక చుక్కేస్తే చిక్కినట్టే..! హాట్‌స్పాట్‌లను గుర్తించిన పోలీసులు..

అలాంటి హాట్‌స్పాట్‌లను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తులు..కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసు అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తూ పట్టుబడుతున్నారు. స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లలో వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలిపారు.

మందుబాబులు జర భద్రం.. ఇక చుక్కేస్తే చిక్కినట్టే..! హాట్‌స్పాట్‌లను గుర్తించిన పోలీసులు..
Drunk And Drive In Hyderaba
Follow us

|

Updated on: May 16, 2023 | 2:07 PM

అర్ధరాత్రి దాటిన తర్వాత నమోదయ్యే రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) జి సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు. అర్థరాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలు జరిగిన కేసుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లలో అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల మధ్య తరచుగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా తాగి వాహనాలు నడిపే వారితో రోడ్డు ప్రమాదాలు జరిగిన హాట్‌స్పాట్‌లను ప్రత్యేక బృందాలు గుర్తించి తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ స్పెషల్ టీమ్‌లకు ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్ నేతృత్వం వహిస్తారని చెప్పారు. పట్టుబడిన వారందరినీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ట్రాఫిక్ పోలీసులు 24 గంటలూ అప్రమత్తంగా ఉంటారు. అర్ధరాత్రి దాటి బయటకు వచ్చి డ్రైవ్ చేస్తే తప్పించుకోవచ్చని భావిస్తే..వదిలిపెట్టేది లేదని జి సుధీర్ బాబు అన్నారు.

నగరంలో హోటళ్లు, బార్‌లు, పబ్‌లు అధికంగా ఉండటంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారి రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి హాట్‌స్పాట్‌లను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తులు..కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసు అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తూ పట్టుబడుతున్నారు. స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లలో వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలిపారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది ఇప్పటివరకు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 13,431 మందిని పట్టుకోగా, 1317 మందిని జైలుకు పంపారు. 243 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు. కోర్టు ఆదేశాలతో రోడ్డు రవాణా సంస్థ అధికారులు 53 మంది లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపినందుకు గాను మొత్తం రూ.3,21,39,060 జరిమానా విధించారు. పట్టుబడిన వారు గోషామహల్, బేగంపేటలోని ట్రాఫిక్ శిక్షణా సంస్థలో కౌన్సెలింగ్ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.