YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డి లేఖపై స్పందించిన సీబీఐ.. వైఎస్ వివేకా హత్య కేసులో మళ్లీ నోటీసులు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి .. తాజాగా సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి .. తాజాగా సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి మంగళవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి తనకు అత్యవసర పనులున్నాయని.. షార్ట్ నోటీస్ కారణంగా హాజరుకాలేకపోతున్నానని సీబీఐ అధికారులకు లేఖ రాశారు. షార్ట్ నోటీసు ఇచ్చినందున.. విచారణకు మరింత సమయం ఇవ్వాలంటూ అవినాష్ కోరారు. అయితే, ఈ లేఖకు సానుకూలంగా స్పందించిన సీబీఐ ఈనెల 19న మరోసారి విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ నోటీసులు జారీ చేసింది. అయితే, 19న అవినాష్ హాజరవుతారా..? లేదా అనేది ఉత్కంఠ నెలకొంది.
అయితే, వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి.. ఏడోసారి సీబీఐ ఎదుట హాజరుకావల్సి ఉంది. 20 రోజుల విరామం అనంతరం.. సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే.. ఎఫ్ఐఆర్ కాపీలో పలు కీలక ఆధారాలను సేకరించిన సీబీఐ.. దాని ప్రకారం విచారణ జరపనుంది. ఇప్పటికే ఆరుసార్లు అవినాష్‌ను పిలిచిన అధికారులు.. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. అనంతరం సేకరించిన అంశాల ఆధారంగా విచారణ జరిపించనున్నారు. ప్రధానంగా ఎంపీ అవినాష్ రెడ్డిపై.. వివేకా హత్య, ఆధారాలు మాయంపై ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..