Andhra Pradesh: దేవునికి మొక్కులు చెల్లించేందుకు వెళ్లారు.. చివరికి ఒకరు మృతి.. ఏం జరిగిందంటే
నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో ఒకరు మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే కొత్తపల్లి మండలం పాతకోట గ్రామానికి చెందిన ఓ కుటుంబం.. మూడుగుల గ్రామ సమీపంలోఉంటున్న దంతల లింగమయ్య వద్దకు దేవుడికి మొక్కులు చెల్లించేందుకు వచ్చారు.
నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో ఒకరు మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే కొత్తపల్లి మండలం పాతకోట గ్రామానికి చెందిన ఓ కుటుంబం.. మూడుగుల గ్రామ సమీపంలోఉంటున్న దంతల లింగమయ్య వద్దకు దేవుడికి మొక్కులు చెల్లించేందుకు వచ్చారు. అయితే ఇలా మొక్కులు చెల్లిస్తుండగా చెట్టుపై ఉన్న తేనెటీగాలు పైకి లేచాయి. అక్కడికి వచ్చిన సుమారు 30 మందిపై దాడి చేశాయి.
ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం ఎర్రమఠం ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. దేవునికి మొక్కులు కొలిచేందుకు వెళ్లి తేనేటీగల దాడిలో ఒకరు మరణించడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి