AP Weather Report: భగ భగ మండిపోవాల్సిందే.. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో.. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ రాబోయే మూడు రోజులకు వాతావరణ పరిస్థితులను అంచనావేసింది.

Heat Wave
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో.. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ రాబోయే మూడు రోజులకు వాతావరణ పరిస్థితులను అంచనావేసింది. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ / వాయవ్య దిశల్లో గాలులువీస్తున్నాయని.. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:
- మంగళవారం: పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. తీవ్ర వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° డిగ్రీలు పెరిగే అవకాశము ఉన్నది.
- బుధవారం: వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4°లు పెరిగే అవకాశము ఉన్నది.
- గురువారం: తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలు 2° నుండి 3° C వరకు తగ్గే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
- ఈరోజు : పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. తీవ్ర వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° డిగ్రీలు పెరిగే అవకాశము ఉన్నది.
- రేపు : పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4°లు పెరిగే అవకాశము ఉన్నది.
- ఎల్లుండి: తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలు 2° నుండి 3° C వరకు తగ్గే అవకాశం ఉంది.
రాయలసీమ:
- ఈరోజు , రేపు : పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. వేడితో కూడిన, అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4°లు పెరిగే అవకాశము ఉన్నది.
- ఎల్లుండి: తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడితో కూడిన మరియు అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° లు పెరిగే అవకాశము ఉన్నది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..