Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండలో బయటికి వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే మాడిపోవాల్సిందే..

సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. త్వరగా జీర్ణం అయ్యే ఆకుకూరలు, పప్పు కూరలు ఉండాలి. నీరు శాతం అధికంగా ఉండే సొరకాయ, దోసకాయ, పొట్లకాయ తీసుకోవాలి. వేడి తగ్గుతుందని కూల్‌డ్రింగ్స్‌ తాగకూడదు..కొబ్బరి బోండాం, మజ్జిగ తాగండి. వడదెబ్బ వల్ల కళ్లు పొడిబారే అవకాశం ఉంది,

ఎండలో బయటికి వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే మాడిపోవాల్సిందే..
Summer Heat
Follow us
Jyothi Gadda

|

Updated on: May 16, 2023 | 1:54 PM

ఈ సారి ఎండాకాలం మండిపోతుంది. ఉదయం ఆరు గంటలకే సూర్యుడు ఎండవేడితో నిప్పురాజేస్తున్నట్టుగా ఉంటుంది. ఇక మధ్యాహ్నం పరిస్థితి నిలుపుల కొలిమిలా మారుతోంది. భగ్గుమంటున్న ప్రచండ భానుడి ఉగ్రరూపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి వేసవికాలంలో అనవసరంగా బయటకు వెళ్లకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ వెళ్లాలనుకున్నప్పుడు ప్రొద్దున్న పదకొండు లోపల, సాయంత్రం నాలుగు తరువాత బయట పనులు చక్కబెట్టుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఈ కాలంలో వేసుకునే దుస్తుల నుండి తీసుకునే ఆహారం వరకు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే భగభగమండే సూర్యుని కిరణాల తాకిడి నుంచి శరీరాన్ని కాపాడుకోగలమంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వెళ్లే ముందు ఒక గ్లాసు నిమ్మరసం, చల్లని పాలు, మజ్జిగ తీసుకోవాలంటున్నారు.

అలాగే, తల, చెవులను పూర్తి తెల్లని మెత్తని క్లాత్‌తో కప్పుకోవాలి. ఒక వాటర్‌ బాటిల్‌ తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలి. ఈ నీళ్లలో కాస్త సాల్ట్‌, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే మంచిది. ఏసీ నుంచి డైరెక్ట్‌గా ఎండలోకి వెళ్లవద్దు. అలాగే ఎండలో తిరిగివచ్చి డైరెక్ట్‌గా ఎసి గదికి వెళ్లవద్దు. వడదెబ్బ తగిలిన తర్వాత మళ్లీ ఎండలోకి వెళ్లకూడదు. రోజుకు ఐదారు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. త్వరగా జీర్ణం అయ్యే ఆకుకూరలు, పప్పు కూరలు ఉండాలి. నీరు శాతం అధికంగా ఉండే సొరకాయ, దోసకాయ, పొట్లకాయ తీసుకోవాలి. వేడి తగ్గుతుందని కూల్‌డ్రింగ్స్‌ తాగకూడదు..కొబ్బరి బోండాం, మజ్జిగ తాగండి. వడదెబ్బ వల్ల కళ్లు పొడిబారే అవకాశం ఉంది, సో సన్‌గ్లాసెస్‌ పెట్టుకోవాలి. ఓఆర్‌ఎస్‌, గ్లూకోజ్‌ నీళ్లు కొంచెం కొంచెంగా తీసుకోవాలి. కీరదోస, పుచ్చకాయ ముక్కల్ని ఎక్కువగా తినాలి. సలాడ్స్‌, తాజా కాయగూరలు, ప్రూట్‌ జ్యూస్‌లు తీసుకోవటం మంచిది.

అలాగే, ఎండ ఎక్కువగా వున్న సమయంలో వంట చేయకుండా ఉండండి. వంట గది తలుపులు. కిటికీలను తీసివుంచి తగినంత గాలి వచ్చేవిదంగా చూసుకోండి. వడ దెబ్బకు గురైన వారిని వేడి నీటిలో ముంచిన గుడ్డతో తుడువరాదు. దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చుటలో ఏమాత్రం ఆలస్యం చేయరాదు. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ మరియు కార్బోనేటేడ్ శీతల పానీయాలు మానేయటం మంచిది.. అధిక ప్రోటీన్, ఉప్ప, కారం, నూనె ఉండే పదార్దాలను తీసుకోవద్దు.

ఇవి కూడా చదవండి

వేసవి కాలంలో మసాలా వంటలు, ఎక్కువ నూనెతో చేసిన వంటలకు, పచ్చళ్లకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలను తీసుకోవడంతోపాటు పచ్చిపులుసు, మజ్జిగ చారు వంటి పలుచని పదార్థాలను ఎక్కువగా శరీరానికి అందించాలి. తీవ్రమైన ఎండలో బయటికి వెళ్ళినప్పుడు తల తిరుగుట, వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గరలోని వైద్యుణ్ణి సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..