AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలు తస్మాత్‌ జాగ్రత్త..! చైన్‌ స్నాచర్లు ఇలా కూడా వస్తారు.. ఈ వైరల్‌ వీడియో చూస్తే షాకే..!!

కౌసల్య, ఆమె భర్త రాజ్‌కుమార్‌ నిత్యం హడ్కో కాలనీ నుంచి సమీపంలోని జివి రెసిడెన్సీకి ఉదయం వాకింగ్‌కు వెళ్తుంటారు. అయితే సోమవారం ఆమె ఒంటరిగానే వాకింగ్‌కు వెళ్లింది. కౌసల్య కాఫీ అవుట్‌లెట్ దగ్గర ఉన్నప్పుడు, ఉదయం 6.30 గంటలకు, వెనుక నుండి తెల్లటి కారు ఆమె వద్దకు వచ్చింది.

మహిళలు తస్మాత్‌ జాగ్రత్త..! చైన్‌ స్నాచర్లు ఇలా కూడా వస్తారు.. ఈ వైరల్‌ వీడియో చూస్తే షాకే..!!
Chain Snatching
Jyothi Gadda
|

Updated on: May 16, 2023 | 12:56 PM

Share

తమిళనాడులోని కోయింబత్తూర్ లో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోయారు. కారులో వచ్చిన దుండగులు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. మెడలోని చైన్‌ గట్టిగా లాడంతో ఆ మహిళ కిందపడిపోయింది. అయినా కూడా దుండగులు వదల్లేదు.. కారుతో కొంత దూరం వరకు ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లారు.. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో, మొబైల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది.

తమిళనాడులోని కోయింబత్తూర్ పీలమేడు వద్ద హడ్కో కాలనీకి చెందిన మహిళ ఆర్.కౌసల్య మార్నింగ్ వాక్‌ కోసం వెళ్లింది. ఈ క్రమంలోనే కారులో వచ్చిన దుండుగులు.. ఆమె మెడలోని చైన్‌ లాక్కునే పారిపోయారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌసల్య, ఆమె భర్త రాజ్‌కుమార్‌ నిత్యం హడ్కో కాలనీ నుంచి సమీపంలోని జివి రెసిడెన్సీకి ఉదయం వాకింగ్‌కు వెళ్తుంటారు. అయితే సోమవారం ఆమె ఒంటరిగానే వాకింగ్‌కు వెళ్లింది. కౌసల్య కాఫీ అవుట్‌లెట్ దగ్గర ఉన్నప్పుడు, ఉదయం 6.30 గంటలకు, వెనుక నుండి తెల్లటి కారు ఆమె వద్దకు వచ్చింది. ముందు ప్యాసింజర్ సీటులో కూర్చున్న ఓ వ్యక్తి అందుబాటులోకి రాగానే ఆమె చైన్ లాక్కున్నాడు. అయితే, కౌసల్య వెంటనే స్పందించి చైన్‌ను గట్టిగా పట్టుకున్నారు. కొన్ని మీటర్ల మేర వాహనంతో పాటు ఈడ్చుకెళ్లినప్పటికీ ఆమె చైన్‌ను విడవకపోవడంతో స్నాచర్‌ అక్కడ్నుంచి జారుకున్నాడు.

ఇవి కూడా చదవండి

సింగనల్లూరు పోలీస్ ఇన్‌స్పెక్టర్ (ఇన్వెస్టిగేషన్ వింగ్) ఎం. మీనాంబిగై మాట్లాడుతూ.. మహిళ ప్రతిఘటించడంతో ఆమె గొలుసు పోలేదని చెప్పారు. కిందపడటంతో ఆమెకు గాయాలైనట్టుగా చెప్పారు. కారుకు నంబర్ ప్లేట్లు లేవు. నిఘా కెమెరా విజువల్ ప్రకారం పక్కన పసుపు రంగు రిఫ్లెక్టర్ స్టిక్కర్ ఉండటంతో అది టాక్సీ క్యాబ్‌గా కనిపిస్తోంది. నేరస్తులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
జపాన్‌తో భారత్ ప్రత్యేకంగా క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడుతోంది?
జపాన్‌తో భారత్ ప్రత్యేకంగా క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడుతోంది?
మల్లెపూల పల్లకి సాంగ్‌లానే మరో పాపులర్ పాట..
మల్లెపూల పల్లకి సాంగ్‌లానే మరో పాపులర్ పాట..
పెరిగిన చికెన్ ధరలు.. అదే బాటలో కోడి గుడ్లు కూడా..
పెరిగిన చికెన్ ధరలు.. అదే బాటలో కోడి గుడ్లు కూడా..
ప్రతి రోజూ ఇది ఒక గిన్నెడు తింటే.. దెబ్బకు డయాబెటిస్ జారుకుంటాది
ప్రతి రోజూ ఇది ఒక గిన్నెడు తింటే.. దెబ్బకు డయాబెటిస్ జారుకుంటాది
'5 సార్లు మెయిన్స్.. 3 ఇంటర్వ్యూ.. 6వ ప్రయత్నంలో IPS అయ్యాడు'
'5 సార్లు మెయిన్స్.. 3 ఇంటర్వ్యూ.. 6వ ప్రయత్నంలో IPS అయ్యాడు'
తరచూ కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో గ్యాస్, అజీర్తి
తరచూ కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో గ్యాస్, అజీర్తి
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..