Watch: భలే బండి గురూ.. పెట్రోల్ అక్కర్లేదు..! బీరుంటే చాలు.. గంటకు 241 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది..
ఇది ఖచ్చితంగా భిన్నమైనదని, నేను మరింత సృజనాత్మకంగా ఉండాలనుకుంటున్నాను అని వివరించాడు. అసలే గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నేను తాగను. నాకు తాగుడు అలవాటు లేదు. కాబట్టి మోటార్ సైకిల్ ఇంధనం కోసం ఆల్కహాల్‌ను
ఓ అమెరికన్ బీరుతో నడిచే మోటార్‌సైకిల్‌ను రూపొందించగా దానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కీ మైఖేల్సన్ అనే వ్యక్తి గతంలో ‘రాకెట్‌పవర్డ్ టాయిలెట్ ’, ‘జెట్‌పవర్డ్ కాఫీ పాట్’ను రూపొందించాడు. తన కొత్త ఆవిష్కరణలో గ్యాస్‌పవర్డ్ ఇంజిన్‌కు బదులుగా హీటింగ్ కాయిల్‌తో కూడిన 14గాలన్ కెగ్ ఉందని తెలిపాడు. కాయిల్ బీర్‌ను 300 డిగ్రీల వరకు వేడి చేస్తుంది. ఇది బైక్‌ను ముందుకు నడిచేలా చేసే నాజిల్‌లో సూపర్‌హీటెడ్ స్టీమ్‌గా మారుతుంది. కీ బ్లూమింగ్‌టన్‌లోని తన గ్యారేజీలో బీర్‌తో నడిచే మోటార్‌సైకిల్‌ను సృష్టించాడు.
ఈ మోటార్‌సైకిల్ గురించి మాట్లాడుతూ.. ఇది ఖచ్చితంగా భిన్నమైనదని, నేను మరింత సృజనాత్మకంగా ఉండాలనుకుంటున్నాను అని వివరించాడు. అసలే గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నేను తాగను. నాకు తాగుడు అలవాటు లేదు. కాబట్టి మోటార్ సైకిల్ ఇంధనం కోసం ఆల్కహాల్‌ను ఉపయోగించడం తప్ప మరేమీ ఆలోచించలేనని ఆయన అన్నారు.
రాకెట్‌మ్యాన్ అని పిలువబడే కీ మైఖేల్సన్ ఇంకా బైక్‌ను రోడ్డుపైకి తీసుకెళ్లలేదు, అయితే బీర్‌తో నడిచే వాహనం కొన్ని స్థానిక కార్ షోలలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ మోటార్‌సైకిల్ గరిష్టంగా గంటకు 240 కి.మీ వేగంతో దూసుకుపోతుందని తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..