Vodafone-Idea Plans: ఒకే ప్లాన్.. కుటుంబంలో అందరూ వాడుకోవచ్చు.. ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్ కూడా..
వోడాఫోన్ ఐడియా(వీఐ) సరికొత్త ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లతో కూడిన కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటిలో ఒకే ప్లాన్ లో మల్టిపుల్ కనెక్షన్లను తీసుకొనే అవకాశం కల్పిస్తోంది. ఆ ప్లాన్లు రూ. 599 నుంచి రూ. 1,149 వరకూ ఉన్నాయి.
వినియోగదారుల అవసరాలను మారిపోతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ఓటీటీలు, యాప్ ల రాకతో ఎంటర్టైన్ మెంట్ ముఖ చిత్రమే మారిపోయింది. ఇది వరకూ ఇంట్లో టీవీ ఉంటేనే సీరియళ్లు, సినిమాలు. ఇప్పుడు అలా కాదు. ఫోన్లలోనే అన్ని టీవీల యాప్ లు, ఓటీటీలు ఉంటున్నాయి. అందరూ వాటినే వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా(వీఐ) సరికొత్త ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లతో కూడిన కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటిలో ఒకే ప్లాన్ మల్టిపుల్ కనెక్షన్లను తీసుకొనే అవకాశం కల్పిస్తోంది. అవి రూ. 599 నుంచి రూ. 1149 వరకూ ఉన్నాయి. వీటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
వోడాఫోన్ ఐడియా రూ. 599 ఫ్యామిలీ ప్లాన్..
వీఐ తీసుకొచ్చిన ఈ రూ. 599 ఫ్యామిలీ ప్లాన్ లో అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 70జీబీ వరకూ డేటాను వాడుకోవచ్చు. నెలకు 3000 ఎస్ఎంఎస్ లు ఉచితంగా చేసుకోవచ్చు. అలాగే 200జీబీ డేటా రోల్ ఓవర్ కింద అందిస్తుంది. దీనిలో రెండు అదనపు కనెక్షన్లు కూడా వస్తాయి. ఇది ప్లాన్లో రెండో కనెక్షన్ తీసుకున్న వారికి అన్ లిమిటెడ్ కాల్స్, 40జీబీ డేటా, నెలకు 3000 ఎస్ఎంఎస్ పంపుకోవ్చు. అలాగే 200జీబీ డేటా రోల్ ఓవర్ కింద అందిస్తుంది. అలాగే ప్రైమరీ మెంబర్ ఆరు నెలల అమెజాన్ ప్రైమ్, ఒక సంవత్సరం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. అంతేకాక రెండు కనెక్షన్లకు వీఐ మూవీస్ అండ్ టీవీ, జీ5 ప్రీమియం లకు ఆరు నెలలు, వీఐ యాప్ లోని యాడ్ ఫ్రీ హంగామ మ్యూజిక్, ఈ స్పోర్ట్స్ లను వినియోగించుకోవచ్చు.
రూ. 999 పోస్ట్ పెయిడ్ ప్లాన్..
ఈ ప్లాన్ లో అన్ లిమిటెడ్ కాల్స్, 140జీబీ డేటా, నెలకు 3000 ఎస్ఎంఎస్ లు ఉచితంగా అందిస్తుంది. అలాగే 200జీబీ రోల్ ఓవర్ డేటా వస్తుంది. ఈ ప్లాన్ పై నాలుగు కనెక్షన్లు వస్తాయి. ప్రతి కనెక్షన్ కు అపరిమిత కాలింగ్, 40జీబీ డేటా, 3000 ఎస్ఎంఎస్ లు, 200జీబీ రోల్ ఓవర్ డేటా వస్తుంది. అదనంగా ప్రైమరీ కనెక్షన్ కు ఆరు నెలల అమెజాన్ ప్రైమ్, ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. అలాగే అదనంగా ఇచ్చే కనెక్షన్లపై వీఐ మూవీస్ అండ్ టీవీ వీఐపీ యాక్సెస్ ఇస్తుంది. అలాగే జీ5 ప్రీమియం, వీఐ యాప్ లోని హంగామ మ్యూజిక్ ని యాడ్ ఫ్రీ గా ఆరునెలల పాటు వినియోగించుకోవచ్చు.
రూ. 1149 పోస్ట్ పెయిడ్ ప్లాన్..
ఈ ప్లాన్ లో అన్ లిమిటెడ్ కాల్స్, 140జీబీ డేటా, నెలకు 3000 ఎస్ఎంఎస్ లు ఉచితంగా అందిస్తుంది. అలాగే 200జీబీ రోల్ ఓవర్ డేటా వస్తుంది. ఈ ప్లాన్ పై ఐదు కనెక్షన్లు వస్తాయి. ప్రతి కనెక్షన్ కు అపరిమిత కాలింగ్, 40జీబీ డేటా, 3000 ఎస్ఎంఎస్ లు, 200జీబీ రోల్ ఓవర్ డేటా వస్తుంది. అదనంగా ప్రైమరీ కనెక్షన్ కు ఆరు నెలల అమెజాన్ ప్రైమ్, ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. అలాగే అదనంగా ఇచ్చే కనెక్షన్లపై వీఐ మూవీస్ అండ్ టీవీ వీఐపీ యాక్సెస్ ఇస్తుంది. అలాగే జీ5 ప్రీమియం, వీఐ యాప్ లోని హంగామ మ్యూజిక్ ని యాడ్ ఫ్రీ గా ఆరునెలల పాటు వినియోగించుకోవచ్చు. అలాగే ఈ స్పోర్ట్స్ ఫీచర్, మల్టీ ప్లేయర్ గేమ్ ను వాడుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..