- Telugu News Photo Gallery Technology photos Check these points before buy second hand smartphone Telugu Tech News
Tech Tips: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా.? అయితే ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి.
ఇటీవల ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ ఫోన్‌ను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇలాంటి ఫోన్‌లను కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలని మీకు తెలుసా.? ఇంతకీ ఆ ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే..
Updated on: May 16, 2023 | 1:12 PM

ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ ఫోన్స్ విక్రయాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా క్విక్కర్ ఓఎల్‌ఎక్స్ లాంటి ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటి అమ్మకాలు భారీగా పెరిగాయి.

సెకండ్ హ్యాండ్ ఫోన్‌లను ఎంత వరకు నమ్మొచ్చనే అనుమానం మనందరిలోనూ ఉంటుంది. అయితే సెకండ్ హ్యాండ్ ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ విషయాలు ఏంటంటే..

ఫోన్ కొనుగోలు చేసే ముందు సదరు ఫోన్ బ్లాక్ లిస్ట్‌లో ఉందేమో చెక్ చేసుకోవాలి. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న ఫోన్‌లను ఉపయోగించడం చట్టరీత్య నేరం. ఇందుకోసం imei.info వెబ్‌సైట్‌లోకి ఫోన్ ఐఎమ్‌ఈఐ నెంబర్‌ను ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు.

ఇక రెండో పాయింట్ హార్డ్‌వేర్ చెక్ చేసుకోవాలి. ఇందుకోసం ప్లేస్టోర్ నుంచి ఫోన్ డాక్టర్ ప్లస్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని ద్వారా ఫోన్‌లో ఏమైనా హార్డ్ వేర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు.

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన మరో అంశం బ్యాటరీ హెల్త్. బ్యాటరీ టెస్ట్‌ను కూడా డాక్టర్ ప్లస్ యాప్‌లోనే చెసుకోవచ్చు. బ్యాటరీ టెస్ట్‌ను రన్ చేస్తే బ్యాటరీ లైఫ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు.





























