Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? నిర్లక్ష్యం చేయకండి.. జాగ్రత్త తప్పనిసరి..

తరచూ చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు, కండరాలు అలసిపోయినప్పుడు కాళ్ల నొప్పి వస్తుంది. మీకు తరచూ ఐస్ క్రీం తినాలనే కోరిక వెనుక కూడా ఒక కారణం ఉంది.

Health Tips: మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? నిర్లక్ష్యం చేయకండి.. జాగ్రత్త తప్పనిసరి..
Symptoms Of Unhealthy Body
Follow us
Jyothi Gadda

|

Updated on: May 16, 2023 | 8:18 AM

మనకు ఆకలిగా లేదా దాహం వేసినప్పుడు మన శరీరం మనకు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. శరీరంలో ఏదైనా తప్పు, సమస్య ఏర్పడినప్పుడు దాని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. శరీరంలోని ఏదైనా భాగంలో నొప్పి, అధిక శరీర ఉష్ణోగ్రత(జ్వరం), బలహీనంగా అనిపించడం, ఇవన్నీ ఏదో ఒకదానిని సూచిస్తాయి. మన శరీరం పోషకాహార లోపం, సరిగా పనిచేయకపోవడం లేదా మరేదైనా ఆరోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు లక్షణాలను చూపుతుంది. దీన్ని సరైన సమయంలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ లక్షణాలను సకాలంలో గుర్తించకపోతే మీ శరీరంలో సమస్యలు మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంటుంది. మీ శరీరం మిమ్మల్ని సహాయం కోసం అడుగుతున్న ఏవైనా సంకేతాలను మీరు విస్మరించకూడదు. అలా నిర్లక్ష్యంగా వదిలేస్తున్న సమస్యలేంటో, వాటి వెనుక కారణలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

చిగుళ్లలో రక్తస్రావం: చిగుళ్లలో రక్తస్రావం ఎప్పుడూ అనారోగ్య చిగుళ్ల వల్ల కాదు. విటమిన్ ‘సి’ లోపం, హార్మోన్ల అసమతుల్యత, కాలేయ సంబంధిత వ్యాధులు, రక్త రుగ్మతలు కూడా దీని వెనుక కారణం కావొచ్చు. తరచూ చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు. దీనిని అధిగమించాలంటే సిట్రిక్ కూరగాయలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి.

ఐస్ క్రీం తినడం: చిన్నప్పుడు ఎండాకాలంలో ఫ్రిజ్ లోంచి ఐస్ క్రీం తీసి తినేవాళ్లం. అయితే, ఐస్ క్రీం తినాలనే కోరిక వెనుక ఒక కారణం రక్తహీనత కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీ శరీరంలో రక్తం లేనట్లయితే, మీరు ఐస్ క్రీం తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దీని కోసం మీరు మీ ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవటం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

చర్మం పొడిబారడం: వాతావరణం మారినప్పుడు చర్మం పొడిబారడం సహజమే, అయితే పొడి చర్మం మిమ్మల్ని చాలా బాధపెడితే, అది శరీరంలో పోషకాల కొరత వల్ల కావచ్చు. ఎక్కువగా శరీరంలో విటమిన్ ఇ లోపం వల్ల చర్మం పొడిబారుతుంది. మీ ఆహారంలో గుడ్లు, బచ్చలికూర, బాదం, పొద్దుతిరుగుడు గింజలు వంటి విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవటం మంచిది.

కాలి నొప్పి: ఇది చాలా సాధారణ సమస్య, కానీ దానిపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. మీ పాదాలలో నొప్పి ఉంటే, అది మెగ్నీషియం లేదా విటమిన్ డి లోపం వల్ల కావచ్చు. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు లేదా కండరాలు అలసిపోయినప్పుడు కాళ్ల నొప్పి వస్తుంది. విటమిన్ డి, మెగ్నీషియం లోపాన్ని అధిగమించడానికి మీరు మీ ఆహారంలో పాలు, పెరుగు, చేపలు, గుమ్మడి గింజలు, ఆకుకూరలు చేర్చుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..