వేసవిలో మైగ్రేన్‌తో మరింత బాధపడుతున్నారా? చింతించకండి ..! ఈ చక్కటి ఇంటి చిట్కాలు మీ కోసమే..

మైగ్రేన్ సాధారణ తలనొప్పి కాదు. దానిని అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది అది పెట్టే బాధేంతో. వికారం, అస్పష్టమైన దృష్టి, తీవ్రమైన తలనొప్పి, చిన్నపాటి శబ్ధాలను కూడా భరించలేకపోవటం, కళ్లు తెరిచి వెలుతురు చూడలేని పరిస్థితి ఇలాంటి అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. మైగ్రేన్ అటాక్ వచ్చినప్పుడు

వేసవిలో మైగ్రేన్‌తో మరింత బాధపడుతున్నారా? చింతించకండి ..! ఈ చక్కటి ఇంటి చిట్కాలు మీ కోసమే..
Migraines
Follow us
Jyothi Gadda

|

Updated on: May 16, 2023 | 7:46 AM

సాధారణంగా ఈ వేసవిలో వడదెబ్బ కారణంగా చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. మైగ్రేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైగ్రేన్ సాధారణ తలనొప్పి కాదు. దానిని అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది అది పెట్టే బాధేంతో. వికారం, అస్పష్టమైన దృష్టి, తీవ్రమైన తలనొప్పి, చిన్నపాటి శబ్ధాలను కూడా భరించలేకపోవటం, కళ్లు తెరిచి వెలుతురు చూడలేని పరిస్థితి ఇలాంటి అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. మైగ్రేన్ అటాక్ వచ్చినప్పుడు దానిని నయం చేసుకోవడానికి ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉంటారు. మైగ్రేన్ లక్షణాలను తగ్గించడంలో సహజ నివారణలు చాలా సహాయపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ అది భరించలేనిదిగా మారినా, చాలా గంటలపాటు ఉపశమనం లేనట్లయితే వైద్యుని సలహా చాలా ముఖ్యం అంటున్నారు. అయితే, కొన్ని ఇంటి నివారణ చర్యలు, డైట్ ప్లాన్  ద్వారా మైగ్రేన్ నుండి బయటపడటానికి అవకాశం ఉందంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కాఫీ తాగండి: శరీరంలోని కొద్ది మొత్తంలో కెఫిన్ మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ సందర్భంలో, మీరు బ్లాక్ కాఫీని తాగొచ్చు. కానీ కొన్నిసార్లు ఎక్కువ కెఫిన్ కూడా మైగ్రేన్‌కు కారణం కావచ్చు.

లావెండర్ ఆయిల్: మైగ్రేన్ అటాక్ సమయంలో మీరు లావెండర్ ఆయిల్‌ను పీల్చినట్లయితే, అది 15 నిమిషాల్లో కొంత ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలో గుర్తించారు. మీరు నేరుగా లేదంటే చేతి రుమాలకు కాస్త లావెండర్‌ ఆయిల్‌ను ఉపయోగించి పీల్చటం ద్వారా కూడా ఉపశమనం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

పిప్పరమింట్ ఆయిల్: మైగ్రేన్ తలనొప్పి స్టార్ట్‌ అయిన వెంటనే మీరు పిప్పరమింట్‌ నూనెను పీల్చుకుంటే కూడా ప్రయోజనం ఉంటుంది. అది మెగ్రేన్‌ మరింత ఎక్కువ కాకుండా నిరోధిస్తుంది.

దాల్చినచెక్క: మైగ్రేన్ భరించలేని నొప్పి నుండి కూడా దాల్చిన చెక్క ఉపశమనాన్ని అందిస్తుంది. మీరు డికాక్షన్ రూపంలో లేదా దాని పేస్ట్‌ను మీ తలపై అప్లై చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

అల్లం: మైగ్రేన్ ఎటాక్‌ సమయంలో మీరు మీ నోటిలో చిన్నపాటి అల్లం ముక్కను పెట్టుకుని నమలండి. మీకు విశ్రాంతి లభిస్తుంది. ఇంకా కావాలంటే దీన్ని టీలో కలుపుకుని తాగవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు