హమ్మయ్యా.. ఎంత చల్లటి కబురు.. మార్కెట్లోకి ఎయిర్‌ కూలర్‌ బెడ్‌షీట్‌.. ఏసీని మించిన చలి..!

ఈ AC బెడ్ షీట్ చల్లబరచడానికి ఒక బల్బు కంటే తక్కువ విద్యుత్‌ ఖర్చవుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కూలర్‌ బెడ్‌ షీట్‌లోపల ఏర్పాటు చేసిన ఫ్యాన్ 4.5 వాట్ల శక్తిని మాత్రమే వినియోగిస్తుంది. అంటే, ఒక వారం పాటు రన్నింగ్‌లో 1 యూనిట్ విద్యుత్ మాత్రమే ఖర్చవుతుంది. మీరు దానిని మడతపెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇది టైమర్‌తో కూడా వస్తుంది. కాబట్టి మీరు గంటకు కూలింగ్‌ని సెట్ చేసుకోవచ్చు.

హమ్మయ్యా.. ఎంత చల్లటి కబురు.. మార్కెట్లోకి ఎయిర్‌ కూలర్‌ బెడ్‌షీట్‌.. ఏసీని మించిన చలి..!
Cooler Bed Sheet
Follow us
Jyothi Gadda

|

Updated on: May 15, 2023 | 12:35 PM

ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి తాపంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఊపిరాడని ఉక్కపోత, చెమట, తేమతో బాధపడుతుంటారు. అధిక ఉష్ణోగ్రత కారణంగా ఇంట్లోని మంచం కూడా మండుతున్న వేడిని పుట్టిస్తుంది. దీంతో నిద్రపట్టడం గగనమైపోయింది. ఏసీ ఉన్న వారు కూడా ఎక్కువ బిల్లులు వస్తాయన్న భయంతో ఎక్కువ సేపు ఏసీ నడపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వేసవిలో చల్లదనం కోసం ప్రజలు తహతహలాడుతున్నారు. అలాంటి వారికోసమే ఈ సూపర్‌ గుడ్‌న్యూస్‌..దీంతో ఇక మీరు ఎయిర్ కండీషనర్, కూలర్‌ని మర్చిపోవచ్చు. ఇదిగో AC లాంటి కూలింగ్ బెడ్ షీట్ మీకు అందుబాటులోకి వచ్చేసింది. మీరు ఎంత వేడిలోనైనా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. వేడిలో పర్లిన్ కూలింగ్‌కు AC బెడ్ షీట్ మంచి ప్రత్యామ్నాయం. ఇది వేడి సీజన్లో ఎక్కువ ఉపయోగిస్తుంటారు. ఈ బెడ్‌షీట్ వేసవి ఉక్కపోతలో కూడా హాయిగా నిద్రపోయేలా చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇది సాధారణ షీట్‌లా కనిపిస్తుంది. అయితే ఇందులో ఉపయోగించిన టెక్నాలజీ మాత్రం చాలా చాలా ప్రత్యేకం. ఇది కూలింగ్ జెల్ మ్యాట్రెస్‌.. అంటే శీతలీకరణ కోసం జెల్ సాంకేతికతను ఉపయోగించారు. ఈ షీట్ ఒక చివర ట్యూబ్ లోపల చల్లగా చేసేందుకు ఫ్యాన్‌ను ఏర్పాటు చేశారు. ఇది షీట్ లోపల గాలిని నింపుతుంది. ఈ బెడ్‌షీట్‌ వర్క్‌ చేస్తున్నప్పుడు కూడా ఎంతో సైలెంట్‌గా ఉంటుంది. కూలర్‌ బెడ్‌ షీట్‌ నడుస్తున్నట్లు కూడా ఎవరికీ తెలియదు. ఫ్యాన్ వేగాన్ని నియంత్రించడానికి కంట్రోల్ బాక్స్, వేడి గాలిని ఎగ్జాస్ట్ చేయడానికి ట్యూబ్‌ను అమర్చారు. అంతేకాదు.. ఈ AC బెడ్ షీట్ చల్లబరచడానికి ఒక బల్బు కంటే తక్కువ విద్యుత్‌ ఖర్చవుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కూలర్‌ బెడ్‌ షీట్‌లోపల ఏర్పాటు చేసిన ఫ్యాన్ 4.5 వాట్ల శక్తిని మాత్రమే వినియోగిస్తుంది. అంటే, ఒక వారం పాటు రన్నింగ్‌లో 1 యూనిట్ విద్యుత్ మాత్రమే ఖర్చవుతుంది. దీని బరువు 2 కిలోలు మాత్రమే. మీరు దానిని మడతపెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇది టైమర్‌తో కూడా వస్తుంది. కాబట్టి మీరు గంటకు కూలింగ్‌ని సెట్ చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మార్కెట్‌లలో AC బెడ్‌షీట్ మీకు ఎంత ఖర్చవుతుంది ? కానీ మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే, ఈ బెడ్‌షీట్‌ను కొంచెం చౌకగా పొందవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లలో 1500 నుండి 2000 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఏసీ బెడ్‌షీట్‌ను శుభ్రం చేయడంలో మాత్రం చాలా  జాగ్రత్తగా ఉండాలి..ఎందుకంటే.. దీనిని సాధారణ బెడ్‌షీట్‌లాగా ఉతకలేదు.. దీన్ని తడిపితే ఇందులోని  విద్యుత్ పరికరం, ఫ్యాన్ దెబ్బతింటుంది. కాబట్టి బెడ్ షీట్ మురికిగా ఉంటే శుభ్రమైన గుడ్డతో మాత్రమే  తుడుచుకోవాలి. ఈ షీట్ వేసవిలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, చార్జింగ్ పెట్టకుండా వాడితే ఏ సీజన్‌లోనైనా ఉపయోగించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..