అంబులెన్స్‌కు డబ్బులు ఇవ్వలేక సంచిలో కొడుకు మృత దేహం…బస్సులో 200కి.మీ ప్రయాణం..
అంత డబ్బు అతని వద్ద లేకపోవడంతో చేసేదేమీ లేక చిన్నారి మృతదేహంతో బస్టాండ్‌కు పయనమయ్యాడు. మృతదేహాన్ని బ్యాగ్‌లో దాచి సుమారు 200 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి కలియాగంజ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి అంబులెన్స్ మాట్లాడుకుని ఇంటికి చేరుకున్నాడు.
కొడుకు కర్మకాండలు జరిపించేందుకు డబ్బులు లేక మృతదేహాన్ని ముక్కలుగా నరికి పడవేసేందుకు ప్రయత్నించింది ఒక కుటుంబం. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకోగా, నలుదిశలా సంచలనం రేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన మరో విషాద సంఘటన ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది. అంబులెన్స్ కు డబ్బులు ఇవ్వలేక ఓ తండ్రి తన కొడుకు మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని సుమారు 200 కిలోమీటర్లు బస్సులోనే ప్రయాణించాడు. ఈ అమానవీయ సంఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కలియాగంజ్ ప్రాంతానికి చెందిన అసిమ్ దేవశర్మకి ఐదు నెలల వయసు ఉన్న కవల పిల్లలు ఉన్నారు. ఇటీవల ఇద్దరు పిల్లలూ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కలియాగంజ్ జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించాడు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆ చిన్నారులను సిలిగురిలోని ఉత్తర బెంగాల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరి ఆరోగ్యం కాస్త కుదుటపడింది. దీంతో ఆ బిడ్డను దేవశర్మ భార్య ఇంటికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో అక్కడే చికిత్స పొందుతున్న మరో కుమారుడు గత శనివారం రాత్రి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బిడ్డ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలని దేవశర్మ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అంబులెన్స్ కోసం వెళ్లగా డ్రైవర్లు రూ.8 వేలు డిమాండ్ చేశారు. అంత డబ్బు అతని వద్ద లేకపోవడంతో చేసేదేమీ లేక చిన్నారి మృతదేహంతో బస్టాండ్‌కు పయనమయ్యాడు. మృతదేహాన్ని బ్యాగ్‌లో దాచి సుమారు 200 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి కలియాగంజ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి అంబులెన్స్ మాట్లాడుకుని ఇంటికి చేరుకున్నాడు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం తెలిసిన నెటిజన్లు ఆ తండ్రి దయనీయ స్థితి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జరిగిన ఘటనపై పలు విపక్ష పార్టీలు సైతం స్పందిస్తూ, ప్రభుత్వ తీరుపై పలు విమర్శలు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..