రహదారి రక్తసిక్తం.. గుంటూరు జిల్లాలో ఘోరం.. కూలీల ఆటోని ఢీకొన్న లారీ, ఐదుగురు మృతి

సంఘటనా స్ధలానికి చేరుకున్న దాచేపల్లి సీఐ బిలాలుద్దీన్ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి ప్ర‌మాదానిఇక గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఆటోలో మొత్తం 23 మంది కూలీలు ఉన్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్రంలోని దామరచర్ల మండలం నరసాపురం గ్రామానికి చెందిన వారుగా తెలిసింది.

రహదారి రక్తసిక్తం.. గుంటూరు జిల్లాలో ఘోరం.. కూలీల ఆటోని ఢీకొన్న లారీ, ఐదుగురు మృతి
Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: May 17, 2023 | 10:16 AM

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీకొట్ట‌డంతో ఐదుగురు అక్కడిక్కడే చ‌నిపోయారు. మరికొంతమందికి తీవ్రగాయాల‌య్యాయి. ఈ ఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద అద్దంకి – నార్కెట్ పల్లి రహదారిపై ఇవ్వాల (బుధవారం) తెల్లవారుజామున జరిగింది. కూలీ పనుల నిమిత్తం తెలంగాణ రాష్ట్రం దామరచర్ల మండలం నుండి గురజాల మండలం పులిపాడునకు వెళ్తున్న ఆటోను దాచేపల్లి నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది.

ఎదురుగా వస్తున్న ఆటోను గ్రామంలోని రామాలయం వద్ద బలంగా ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలలో అయిదుగ‌రు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్ధానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దాచేపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న దాచేపల్లి సీఐ బిలాలుద్దీన్ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి ప్ర‌మాదానిఇక గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఆటోలో మొత్తం 23 మంది కూలీలు ఉన్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్రంలోని దామరచర్ల మండలం నరసాపురం గ్రామానికి చెందిన వారుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి..