Chandrababu: పిచ్చి పట్టిందా.. దేవుని సన్నిధిలో ఈ ‘గన్’ సంస్కృతి ఏంటి.. తిరుపతి గంగమ్మ అలంకరణపై చంద్రబాబు ఫైర్

జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన పూల అలంకారంపై మాటల తూటాలు పేలుతున్నాయి. జాతర సందర్భంగా సోమవారం రాత్రి ఆలయ ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేకంగా పూలతో ఆకర్షనీయంగా తోరణాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా ఈ పూల అలంకరణపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తన ట్విట్టర్..

Chandrababu: పిచ్చి పట్టిందా.. దేవుని సన్నిధిలో ఈ 'గన్' సంస్కృతి ఏంటి..  తిరుపతి గంగమ్మ అలంకరణపై చంద్రబాబు ఫైర్
Tirupati Gangamma Temple
Follow us
Sanjay Kasula

|

Updated on: May 17, 2023 | 9:52 AM

ఏపీలో రాజకీయం హాట్ హాట్‌గా సాగుతోంది. తాజాగా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన అలంకరణ వివాదంగా మారింది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన పూల అలంకారంపై మాటల తూటాలు పేలుతున్నాయి. జాతర సందర్భంగా సోమవారం రాత్రి ఆలయ ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేకంగా పూలతో ఆకర్షనీయంగా తోరణాన్ని ఏర్పాటు చేశారు. అయితే ముఖ ద్వారం వైపు వివిధ రంగులు పోలిన పూలమధ్యలో జె (J) అనే ఇంగ్లీస్ అక్షరం, గన్‌ (రివాల్వార్) బొమ్మలా డిజైన్ ఏర్పాటు చేశారు. ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదేంటంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆలయ పరిసరాల్లో ఇలాంటివి సరికాదంటూ హితవు పలుకుతున్నారు.

తాజాగా ఈ పూల అలంకరణపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తన ట్విట్టర్ హాండిల్‌లో ఈ ఫోటోతోపాటు కామెంట్ జోడించారు. ‘తిరుపతి గంగమ్మ గుడికి ఇలాంటి అలంకారమా? దేవుని సన్నిధిలో ఈ ‘గన్’ సంస్కృతి ఏంటి ? వైసీపీ జెండా గుర్తులు ఏంటి? పిచ్చి పట్టిందా? ‘J’ అక్షరానికి గంగమ్మకి సంబంధం ఉందా? మీ ప్రచార పిచ్చితో, అహంకారంతో దేవుళ్ళ దగ్గర ఇలాంటి వేషాలా? అంటూ ట్వీట్ చేశారు..

రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా మండిపడుతున్నారు. గంగమ్మ తల్లి ఆలయం దగ్గర ‘జె గన్‌’ రూపంలో పూలతో అలంకరించడం సరికాదన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.భానుప్రకాష్‌రెడ్డి. ఈ వివాదంపై ఆలయ అధికారులు స్పందించాల్సి ఉంది.. ఈ తోరణం ఎవరు ఏర్పాటు చేశారన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?