Andhra Pradesh: భూమా అఖిలప్రియ అరెస్ట్‌.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో పోలీసుల యాక్షన్

ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగిన ఘటనలో అఖిలప్రియతోపాటు ఆమె అనుచరులపై అటెంప్ట్‌ టు మర్డర్ కేసులు నమోదుయ్యాయి.  అఖిలప్రియ PA మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Andhra Pradesh: భూమా అఖిలప్రియ అరెస్ట్‌.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో పోలీసుల యాక్షన్
Akhila Priya
Follow us
Sanjay Kasula

|

Updated on: May 17, 2023 | 8:45 AM

భూమా అఖిలప్రియను నంద్యాల పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం నంద్యాలకు తరలించారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగిన ఘటనలో అఖిలప్రియతోపాటు ఆమె అనుచరులపై అటెంప్ట్‌ టు మర్డర్ కేసులు నమోదుయ్యాయి.  అఖిలప్రియ PA మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఉదయాన్నే ఆమె ఇంటికి వెళ్లిన నంద్యాల పోలీసులు.. నిన్నటి ఘటన, అక్కడి పరిణామాలపై ఆరా తీశారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె ఆదేశాలతోనే దాడి జరిగిందని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. అఖిలప్రియతో పాటు మరికొందరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. మరోవైపు నంద్యాల్లో ఏవీ సుబ్బారెడ్డి ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు.

టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అదే పార్టీకి చెందిన అఖిలప్రియ వర్గం దాడి చేసింది. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. ఏబీ సుబ్బారెడ్డిపై దాడితో యువగళం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడిలో ఏబీ సుబ్బారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. నారాలో లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాలలో కొనసాగుతోంది. ఈ యాత్రలో వైవీ సుబ్బారెడ్డి సహా ఇతర నేతలు పాల్గొన్నారు. అయితే, అఖిలప్రియ వర్గానికి చెందిన కొందరు.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. లోకేష్ ముందే ఈ దాడి జరుగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తనపై దాడి చేయడంపై ఏబీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే డైరెక్ట్‌గా కక్ష తీర్చుకోవాలంటూ సవాల్ విసిరారు ఏవీ. మరోవైపు, ఈ ఘటనతో పరిస్థితి అదుపు తప్పడంతో.. పాదయాత్ర నుంచి సుబ్బారెడ్డిని పంపించారు పోలీసులు.

మరి నంద్యాలలో ఈ ఘటన ఏ పరిస్థితులకు దారితీస్తుందోనని పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. మరోవైపు.. దాడి ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు.. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తపడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..