Viveka Murder Case: బెయిల్‌ కోసం సుప్రీంకోర్టుకు అవినాష్‌రెడ్డి.. హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ తన పిటిషన్‌ను వినేలా..

కడప ఎంపీ అవినాష్ రె్డ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టులో తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసిన నేపథ్యంలో సీబీఐ దూకుడుగా ఉండటంతో

Viveka Murder Case: బెయిల్‌ కోసం సుప్రీంకోర్టుకు అవినాష్‌రెడ్డి.. హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ తన పిటిషన్‌ను వినేలా..
Avinash Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: May 17, 2023 | 11:53 AM

హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ తన పిటిషన్‌ను వినేలా ఆదేశించాలని కడప ఎంపీ అవినాష్ రె్డ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టులో తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసిన నేపథ్యంలో సీబీఐ దూకుడుగా ఉండటంతో ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సుప్రీంకోర్టును పిటీషన్ వేశారు. గతంలో ఈ కేసులో తనను సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా అవినాష్ కు ఊరట దక్కలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలే కీలకంగా మారాయి. అయితే వేసవి సెలవులకు ముందు ఈ వ్యవహారం తేల్చేందుకు తెలంగాణ హైకోర్టు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. నిన్న అవినాష్‌రెడ్డి అనుచరులను విచారించింది సీబీఐ. ఇందులో విశ్వేశ్వర్‌రెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ఇంటరాగేషన్‌

దీంతో సీబీఐ స్పీడ్‌ చూస్తుంటే వివేకా మర్డర్‌ కేసు క్లైమాక్స్‌కి వచ్చేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఒక లెక్క, ఇప్పట్నుంచి మరో లెక్క అన్నట్టుగా దూకుడు చూపిస్తోంది సీబీఐ. ఇన్నాళ్లూ ప్రధాన నిందితులపైనే దృష్టిపెట్టిన సీబీఐ, ఇప్పుడు వాళ్ల అనుచరులపైనా ఫోకస్‌ పెట్టింది. అందరికీ నోటీసులిస్తూ వరుసబెట్టి ప్రశ్నిస్తోంది. అవినాష్‌రెడ్డికి మరోసారి నోటీసులిచ్చిన సీబీఐ.. వివేకా కూతురు, అల్లుడ్ని కూడా పిలిచి విచారించింది.

ఏపీలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురిని నిందితులుగా చేర్చిన సీబీఐ.. వారిలో ఆరుగురిని అరెస్టు చేసింది. మరో నిందితుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా రేపో మాపో అరెస్టు చేసేందుకు సిద్దమవుతోంది. మరోవైపు సీబీఐ అరెస్టు అవకాశం నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాష్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఎటూ తేల్చలేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!