Viral Video: అరేయ్ ఎవర్రా మీరంతా.. మెట్రో ఎక్కితే ఇలా చిర్రెత్తిపోతారు..

సోషల్ మీడియా ఇన్‌స్టాలో కొన్ని రోజుల క్రితం ఈ వీడియోను పోస్ట్ చేయగా, ఇప్పటికే 1.13 లక్షల మంది వీడియోను వీక్షించారు. వీడియోను షేర్ చేస్తూ కామెంట్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చాయి. వైరల్ అవుతున్నవీడియోలో.. మెట్రో రైలు కోచ్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. ఢిల్లీ మెట్రోలో అంతకంటే దారుణాలు వెలుగుచూశాయి. దాంతో మెట్రో సిబ్బంది పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చింది.

Viral Video: అరేయ్ ఎవర్రా మీరంతా.. మెట్రో ఎక్కితే ఇలా చిర్రెత్తిపోతారు..
Indians Dancing In London M
Follow us
Jyothi Gadda

|

Updated on: May 17, 2023 | 12:09 PM

ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తేనే అర్ధం అయిపోతుంది. నేటి యువత పాపులర్ కావడానికి ఎలాంటి పనికైనా సిద్ధపడుతున్నారని, వైరల్ కావడం కోసం, లైక్స్ కోసం ఏం చేయడానికైనా వారు వెనుకాడటం లేదు. ఈ క్రమంలో వారు సమాజాన్ని కాదు కదా, ఆ సమయంలో తమ చుట్టూ ఎంతమంది వున్నా పట్టించుకోవడం లేదు. పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు.ఇదేంటి అని ఎవరన్నా అడిగితే… ఇది సోషల్ మీడియా ప్రమోషన్ అంటూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే మెట్రో రైళ్లలో యువతీ యువకులు చేస్తున్న వీడియోలు, రీల్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మెట్రోకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు మెట్రోలో స్నానం చేస్తుండగా, మరికొందరు మెట్రోలో అసభ్యకర పనులు చేస్తూ కనిపించారు. ఇప్పుడు లండన్‌లోని మెట్రోలో భారతదేశానికి చెందిన కొంతమంది పంజాబీ పాటకు డ్యాన్స్ చేశారు. వారు చేస్తున్న డ్యాన్స్‌ను మెట్రోలో ప్రయాణిస్తున్న చాలా మంది చూశారు. వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ పేజీ ub1ub2 కొన్ని రోజుల క్రితం ఈ వీడియోను పోస్ట్ చేసింది. కాగా, ఇప్పటికే 1.13 లక్షల మంది వీడియోను వీక్షించారు. వీడియోను షేర్ చేస్తూ కామెంట్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చాయి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్నవీడియోలో.. మెట్రో రైలు కోచ్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. దీన్ని మంచి అవకాశంగా తీసుకున్న కొందరు భారతీయులు.. పంజాబీ పాటలకు అదిరిపోయే డ్యాన్స్‌ చేస్తారు! అమర్ సింగ్ చమ్కిలా, అమర్‌జోత్‌ల కంకర్డ్ గల్ సన్ మఖ్నా పాటకు ఈ ఇండియన్స్‌ డ్యాన్స్‌తో ఇరగదీశారు.. Ealing Broadway station సమీపంలోని లండన్ ట్యూబ్‌లో పంజాబీలు చేసిన డ్యాన్స్‌ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది.

View this post on Instagram

A post shared by (Southall) UB1UB2 (@ub1ub2)

ఇదిలా ఉంటే, గతంలో ఒక అమ్మాయి మెట్రో కోచ్‌లో పంజాబీ పాటపై డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేయటంతో ఆమె పలువురి నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిన ఘటన మీకు తెలిసిందే. అంతేకాదు, ఢిల్లీ మెట్రోలో అంతకంటే దారుణాలు వెలుగుచూశాయి. దాంతో మెట్రో సిబ్బంది పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..