AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వామ్మో ఇవేం కండీషన్స్‌ రా అయ్యా.. పెళ్లి కావాలట.. కానీ, అమ్మాయికి అవన్నీ ఉండాలట.. మ్యాటర్ తెలిస్తే షాకే..!

మనం దేశంలో చాలా రాష్ట్రాల్లో అబ్బాయిలకు అమ్మాయిలు దొరక్క, పెళ్లిళ్లు అవ్వక అలాగే ఉండిపోతున్నారు. తమకు పెళ్లిళ్లు అయ్యే అవకాశం కల్పించండి బాబోయ్ అంటూ చాలా మంది యువకులు.. ఏకంగా ప్రభుత్వాలకే మొరపెట్టుకుంటున్న సందర్భాలూ చూశాం. కర్నాటకలో అయితే, తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అబ్బాయిలను

Viral: వామ్మో ఇవేం కండీషన్స్‌ రా అయ్యా.. పెళ్లి కావాలట.. కానీ, అమ్మాయికి అవన్నీ ఉండాలట.. మ్యాటర్ తెలిస్తే షాకే..!
Couple Marriage
Shiva Prajapati
|

Updated on: May 17, 2023 | 3:12 PM

Share

మనం దేశంలో చాలా రాష్ట్రాల్లో అబ్బాయిలకు అమ్మాయిలు దొరక్క, పెళ్లిళ్లు అవ్వక అలాగే ఉండిపోతున్నారు. తమకు పెళ్లిళ్లు అయ్యే అవకాశం కల్పించండి బాబోయ్ అంటూ చాలా మంది యువకులు.. ఏకంగా ప్రభుత్వాలకే మొరపెట్టుకుంటున్న సందర్భాలూ చూశాం. కర్నాటకలో అయితే, తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అబ్బాయిలను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు నగదు కూడా అందిస్తామంటూ హామీలు ఇచ్చేశారు. ఇలాంటి పరిస్థితిలో ఓ వ్యక్తి మాత్రం తన పెళ్లి కోసం గొంతెమ్మ కోరికలు కోరుతున్నాడు. ఈ కోరికలతోనే ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాడు. అయితే, ఇతగాడు మన దేశానికి చెందిన వాడు కాదులేండి. మన పొరుగు దేశమైన చైనాకు చెందిన అబ్బాయి.

ఈయనగారికి పెళ్లి చేసుకునే అమ్మాయి జాబ్ చేస్తుండాలట. అంతేకాదు.. కారు, బంగ్లా కూడా ఉండాలట. పైగా ఆ అమ్మాయికి అప్పులు, బ్యాంక్స్ లోన్స్ వంటివేవీ ఉండకూడదట. అలాంటి అమ్మాయిని తాను పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు చైనా కుర్రాడు. ఇందుకు సంబధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌‌, షెన్‌జెన్‌కు చెందిన ఓ యువకుడు తన చేతిలో బ్యానర్‌తో పార్కులో నిలబడి ఉన్నాడు. అందులో తాను వధువు కోసం వెతుకుతున్నట్లుగా పేర్కొన్నాడు. అయితే, అతను కొన్ని షరతులు పెట్టాడు. వాటి ప్రకారం.. అమ్మాయి ఇంటి పనిలో నైపుణ్యం కలిగి ఉండాలి. దాంతోపాటు సంపాదిస్తుండాలి. ఆమె జీతం కనీసం 12 వేల యువాన్లు(భారత కరెన్సీలో రూ. 1,41,336.60) ఉండాలని కూడా పేర్కొన్నాడు. అంతేకాదండోయ్.. ఆ అమ్మాయికి మాంచి కారు, నివాసానికి బంగ్లా ఉండాలన్నాడు. ఇక కొసమెరుపు ఏంటంటే.. సదరు అమ్మాయికి ఎలాంటి అప్పులు కూడా ఉండకూడదని స్పష్టం చేశాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. అమ్మాయికి 12 యువాన్ల జీతం కావాలని కోరిన ఈయన గారి జీతం ఎంతో తెలుసా? కేవలం 6 వేల యువాన్లు మాత్రమే. అంటే భారతకరెన్సీలో రూ.71 వేలు సంపాదిస్తున్నాడు. ఈయనగారికి సొంత ఇల్లు, కారు కూడా లేదు.

ఇవి కూడా చదవండి

అయితే, తన జీతం తక్కువే అయినా సంపాదిస్తున్న భార్యకైనా మంచి భర్తగా ఉండగలనని ఆ అబ్బాయి తన క్వాలిటీని రాసుకున్నాడు. ఎందుకంటే అతనికి చెడు వ్యసనం లేదు. అంతే కాకుండా ఇంటి అల్లుడు కావడంతో అత్తగారిని, మామగారిని బాగా కూడా చూసుకుంటానని చెబుతున్నాడు. కాగా, కుర్రాడి కండిషన్స్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అది చూసి అవాక్కవుతున్నారు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..