Viral: యూట్యూబ్ చూసి కారు డ్రైవింగ్ నేర్చుకున్న ఆరేళ్ల పిల్లాడు.. మూడేళ్ల చెల్లితో కలిసి షికారుకెళ్లాడు.. కట్ చేస్తే షాకింగ్ సీన్..!

చిన్న పిల్లల చేష్టలకు, వారి మొండితనానికి విసిగిపోయిన పేరెంట్స్ వారికి మొబైల్స్ అందజేయడం మనం చూస్తూనే ఉంటాం. మీరు కూడా మీ పిల్లలకు అలాగే ఇస్తున్నట్లయితే కొంచెం అలర్ట్‌గా ఉండండి. ఎందుకంటే ఇప్పటి పిల్లలు చాలా మోనార్క్‌లు. చూసిన వాటిని ఇట్టే గ్రహించేస్తారు. అందుకు నిదర్శనమైన, షాకింగ్ ఘటన ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Viral: యూట్యూబ్ చూసి కారు డ్రైవింగ్ నేర్చుకున్న ఆరేళ్ల పిల్లాడు.. మూడేళ్ల చెల్లితో కలిసి షికారుకెళ్లాడు.. కట్ చేస్తే షాకింగ్ సీన్..!
Boy Driving
Follow us

|

Updated on: May 17, 2023 | 5:54 PM

చిన్న పిల్లల చేష్టలకు, వారి మొండితనానికి విసిగిపోయిన పేరెంట్స్ వారికి మొబైల్స్ అందజేయడం మనం చూస్తూనే ఉంటాం. మీరు కూడా మీ పిల్లలకు అలాగే ఇస్తున్నట్లయితే కొంచెం అలర్ట్‌గా ఉండండి. ఎందుకంటే ఇప్పటి పిల్లలు చాలా మోనార్క్‌లు. చూసిన వాటిని ఇట్టే గ్రహించేస్తారు. అందుకు నిదర్శనమైన, షాకింగ్ ఘటన ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆరేళ్ల పిల్లాడు మొబైల్‌లో యూట్యూబ్ చూస్తూ కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అంతే కాదండోయ్.. ఏకంగా ఆ డ్రైవింగ్ టెస్ట్‌ను తన తండ్రి కారుపైనే ప్రయోగించాడు. పైగా తన మూడేళ్ల చిన్నారి చెల్లిని కూడా తన వెంట కారులో తీసుకెళ్లడం కొసమెరుపు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మలేషియాలోని లంకావి లో ఈ ఘటన చోటు చేసుకుంది. యూట్యూబ్‌లో కారు డ్రైవింగ్‌కు సంబంధించిన వీడియో చూసిన ఆ ఆరేళ్ల చిన్నోడు.. గుట్టు చప్పుడు కాకుండా తన తండ్రి కారు తాళాలు తీసుకున్నాడు. బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేశాడు. తన వెంట మూడేళ్ల చెల్లిని కూడా తీసుకెళ్లాడు. దాదాపు 2.5 కిలోమీటర్లు డ్రైవింగ్ చేసిన పిల్లాడు.. చివరకు ఓ స్తంభాన్ని ఢీకొట్టాడు. అది గమనించిన స్థానికులు.. వచ్చి ప్రమాదానికి గురైన కారును పరిశీలించారు. అందులో డ్రైవింగ్ చేస్తూ ఆరేళ్ల పిల్లాడు.. ఆ పక్కనే మూడేళ్ల వయసున్న చిన్నారి ఉన్నారు. వారిని చూసి జనాలు షాక్ అయ్యారు. వారిని కిందకు దించి ఆరా తీయగా.. చెప్పిన విషయాలు విని బిత్తరపోయారు.

తాను, తన చెల్లితో కలిసి బొమ్మలు కొనుక్కునేందుకు షాప్‌కి వెళ్తున్నామంటూ సమాధానం చెప్పాడు చిచ్చరపిడుగు. అది విని వారి మైండ్ బ్లాంక్ అయ్యింది. కాగా, ఈ ప్రమాదంలో చిన్నారి దవడకు చిన్న గాయం కాగా, కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న లంకావి పోలీసులు ప్రమాద స్థలికి వచ్చారు. చిన్నారి నుంచి వివరాలు సేకరించారు.

ఇవి కూడా చదవండి

తల్లిదండ్రులు నిద్రపోవడం గమనించి..

ఆ బుడ్డోడు చాలా రోజులుగా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ డ్రైవింగ్ నేర్చుకున్నాడట. అయితే, కారును తోలే అవకాశం కోసం ఎదురు చూశాడు. తాను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. తల్లిదండ్రులు నిద్రస్తున్న సమయం గుర్తించిన పిల్లాడు.. వారికి చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి కారు కీస్ తాళాలు తీసుకుని బయటకు వచ్చేశాడు. కట్ చేస్తే ఓ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. అయితే, మధ్యలో నిద్రలేచిన చిన్నారి తండ్రి పిల్లల కోసం చూడగా ఎక్కడా కనిపించలేదు. బాత్‌రూమ్‌లో ఏమైనా ఉన్నారా? అని చెక్ చేయగా.. అక్కడా కనిపించలేదు. చివరకు మ్యాటర్ తెలిసి వారు కూడా అవాక్కయ్యారు. అయితే, అదృష్టావశాత్తు ఈ ప్రమాదంలో పిల్లలిద్దరూ సేఫ్‌గా ఉన్నారు.

సో.. బీకేర్‌ఫుల్ పేరెంట్స్. పిల్లలకు మొబైల్ ఇచ్చినా.. వారు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తుండాలి. లేదంటే.. పైన చదివారుగా మ్యాటర్. తేడా వస్తే మీటర్ లేచిపోద్ది మరి.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..