Astro Tips: ఉదయాన్నే నిద్ర లేవగానే వీటిని చూడండి.. అంతా శుభమే జరుగుతుంది..!
కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా.. అదృష్టం కలిసి రాకపోయినా.. ఏ పని తలపెట్టినా వ్యతిరేకంగా జరుగుతున్నా.. ఛీ ఛీ పొద్దున్నే ఎవరి ముఖం చూశామో ఏమో అంటూ విసుక్కుంటారు. ఈ పరిస్థితిని చాలా మంది ఎదుర్కొనే ఉంటారు.
కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా.. అదృష్టం కలిసి రాకపోయినా.. ఏ పని తలపెట్టినా వ్యతిరేకంగా జరుగుతున్నా.. ఛీ ఛీ పొద్దున్నే ఎవరి ముఖం చూశామో ఏమో అంటూ విసుక్కుంటారు. ఈ పరిస్థితిని చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. అవును మరి, వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయాన్నే కొన్నింటిని చూస్తే మంచి జరుగుతుందట.. మరికొన్నింటి చూస్తే చెడు జరుగుతుందట.. మరి ఇంతకీ ఏం చూస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత ఏం చూడాలి?
1. ఉదయాన్నే నిద్రలేచిన తరువాత వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడిని చూస్తే మంచి జరుగుతుందట. ఆ రోజు చేపట్టిన పనులన్నీ సవ్యంగా జరుగుతాయట.
2. ఉదయం నిద్ర లేచిన తరువాత తులసి మొక్కను చూస్తే మేలు జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్క విష్ణు దేవుడికి ప్రీతికరమైన మొక్క, లక్ష్మీ దేవికి ప్రతిరూపం అని అంటారు. ఆ కారణంగా ఉదయాన్నే తులసి మొక్కను చూస్తే మేలు జరుగుతుందని విశ్వాసం.
3. ఉదయం లేచిన వెంటనే దీపాన్ని చూస్తే మేలు జరుగుతుందని చెబుతున్నారు వేద పండితులు.
4. ఉదయం నిద్ర లేచాక.. బంగారం, సూర్యుడు లను చూస్తే ఆ రోజంతా మంచే జరుగుతుందట.
5. ఉదయాన్నే సముద్రం, గుడి గోపురం చూసినా మేలు జరుగుతుందని చెబుతున్నారు పండితులు.
6. ఉదయం నిద్ర లేచిన వెంటనే.. దేవుడి చిత్ర పటాలు, నెమలి పింఛాలు, పువ్వులను చూస్తే శుభం కలుగుతుందట.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు మత గ్రంధాలు, విశ్వాసాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..