AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Regional Parties: దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు ఎన్ని కోట్లు విరాళాలు వచ్చాయో తెలుసా ?

దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు 2021-22 ఆర్థిక ఏడాదిలో గుర్తుతెలియని వర్గాల నుంచి రూ.887.55 కోట్లు విరాళాలుగా వచ్చినట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. వాటి మొత్తం రాబడిలో ఇది 76 శాతమని పేర్కొంది.

Regional Parties: దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు ఎన్ని కోట్లు విరాళాలు వచ్చాయో తెలుసా ?
Money
Aravind B
|

Updated on: May 17, 2023 | 11:26 AM

Share

దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు 2021-22 ఆర్థిక ఏడాదిలో గుర్తుతెలియని వర్గాల నుంచి రూ.887.55 కోట్లు విరాళాలుగా వచ్చినట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. వాటి మొత్తం రాబడిలో ఇది 76 శాతమని పేర్కొంది. అయితే అంతకుముందు ఏడాది వచ్చిన రూ.263.93 కోట్లతో పోలిస్తే ఇది చాలావరకు ఎక్కువని తెలిపింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. రూ.20 వేల కంటే తక్కువ నగదు ఇచ్చినవారు ఉంటే ఎలక్టోరల్‌ బాండు ద్వారా విరాళం ఇచ్చిన వారి వివరాలను పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలక్టోరల్‌ బాండ్లు, సేల్స్‌ ఆఫ్‌ కూపన్స్‌, రిలీఫ్‌ ఫండ్స్‌,వాలంటరీ కంట్రిబ్యూషన్‌లు, మోర్చాల ద్వారా సేకరించే నిధులు మొదలైనవి ఇలాంటి గుప్త విరాళాల కిందకే వస్తాయని ఏడీఆర్‌ తెలిపింది.

అయితే తాజాగా ప్రాంతీయ పార్టీలకు వచ్చిన రూ.887.55 కోట్లలో దాదాపు 93.26 శాతం ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా వచ్చినవేనని స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన 54 ప్రాంతీయ పార్టీలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకోవాలని ముందుగా అనుకోగా.. కేవలం 28 పార్టీలు మాత్రమే వార్షిక ఆడిట్‌, విరాళాల నివేదికలను సమర్పించాయని తెలిపింది. మిగతావి ఏదో ఒక రిపోర్టును మాత్రమే అందించాయని పేర్కొంది. 2021-22 ఆర్థిక ఏడాదిలో 27 ప్రాంతీయ పార్టీల సంపాదన రూ.1,165.58 కోట్లు కాగా, అందులో తెలిసిన దాతల ద్వారా వచ్చినవి రూ.145.42 కోట్లు మాత్రమేనని ఏడీఆర్‌ తేల్చిచెప్పింది.

అయితే 2021-22లో గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల ద్వారా ప్రాంతీయ పార్టీలకు వచ్చిన ఆదాయాలను పరిశీలిస్తే… అత్యధికంగా డీఎంకేకు 306.25 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత బిజూ జనతాదళ్‌కు రూ.291.96 కేట్లు, తెరాస (ఇప్పుడు భారాస)కు రూ.153 కోట్లు, వైసీపీకి రూ.60.168 కోట్లు రాగా.. తెదేపాకు రూ.3.63 కోట్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..