Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో మొండెం లేని తల కలకలం.. సీసీ ఫుటేజ్‌ను సేకరించిన పోలీసులు..!

ఈ ఏడాది ఏప్రిల్ 12న హైద్రాబాద్ కు సమీపంలోని తుక్కుగూడ సమీపంలో మహిళ డెడ్ బాడీ లభ్యమైంది. మహిళపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ప్లాస్టిక్ బ్యాగులో మహిళ డెడ్ బాడీని నిందితులు వదిలివెళ్లారు. తాజాగా మరో సంఘటన కలకలం రేపుతోంది.

హైదరాబాద్‌లో మొండెం లేని తల కలకలం.. సీసీ ఫుటేజ్‌ను సేకరించిన పోలీసులు..!
Crime
Follow us
Jyothi Gadda

|

Updated on: May 17, 2023 | 1:08 PM

హైద‌రాబాద్ లో మొండెం లేని మహిళ తల కనిపించటం కలకలం రేపింది. హైద‌రాబాద్ లోని మలక్‌పేట తీగలగూడ వద్ద మొండెం లేని మహిళ తల కనిపించటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళను ఎక్కడో హత్య చేసి కవర్ లో తలను మూసీ సమీపంలో తీగలగూడ వద్ద వదిలివేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ మొండెం ఎక్కడ ఉందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మహిళ ఎవరనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరో వైపు, మొండెం లేని తల మహిళను హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మహిళను హత్య చేసిన దుండగుల కోసం దర్యాప్తును ప్రారంభించారు. సంఘటన స్థలంలో పోలీసులు క్లూస్ సేకరిస్తున్నారు. ఈ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

అయితే, గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 12న హైద్రాబాద్ కు సమీపంలోని తుక్కుగూడ సమీపంలో మహిళ డెడ్ బాడీ లభ్యమైంది. మహిళపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ప్లాస్టిక్ బ్యాగులో మహిళ డెడ్ బాడీని నిందితులు వదిలివెళ్లారు. తాజాగా మరో సంఘటన కలకలం రేపుతోంది. ఇలాంటి వరుస హత్యల నేపథ్యంలో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..
మీ లివర్ పాడైపోకుండా ఉండాలంటే ఈ మ్యాజిక్ డ్రింక్స్ ని తీసుకోండి
మీ లివర్ పాడైపోకుండా ఉండాలంటే ఈ మ్యాజిక్ డ్రింక్స్ ని తీసుకోండి
బాత్రూం ఎప్పుడూ ఫ్రెష్‌ గా ఉండాలంటే.. ఈ చిన్న పనులు చేస్తే చాలు
బాత్రూం ఎప్పుడూ ఫ్రెష్‌ గా ఉండాలంటే.. ఈ చిన్న పనులు చేస్తే చాలు
నోరూరించే సేమ్యా చక్కర పొంగలిని క్షణాల్లో చేసుకోండి.. రెసిపీ
నోరూరించే సేమ్యా చక్కర పొంగలిని క్షణాల్లో చేసుకోండి.. రెసిపీ
బొప్పాయిని పరగడుపున తిని చూడండి.. శరీరంలో మ్యాజిక్‌ జరుగుతుంది..!
బొప్పాయిని పరగడుపున తిని చూడండి.. శరీరంలో మ్యాజిక్‌ జరుగుతుంది..!
ఉడికించిన గుడ్లతో హోటల్ స్టైల్ రెసిపీ.. ఇంట్లోనే చేసేయండిలా
ఉడికించిన గుడ్లతో హోటల్ స్టైల్ రెసిపీ.. ఇంట్లోనే చేసేయండిలా