Telangana: రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చే విషయంపై క్లారిటీ ఇచ్చిన మాణిక్‌రావ్ ఠాక్రే..
ఇటీవల రైతులకు ఉచిత విద్యుత్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల వ్యతిరేక వైఖరి చూపిస్తోందంటూ మండిపడుతున్నారు.
ఇటీవల రైతులకు ఉచిత విద్యుత్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల వ్యతిరేక వైఖరి చూపిస్తోందంటూ మండిపడుతున్నారు. అయితే ఈ వివాదంపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే స్పందిచారు. రేవంత్ రెడ్డి కరెంట్ విషయంలో మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు బీఆర్ఎస్ కంటే ఎక్కువగానే మేలు చేస్తామని స్పష్టం చేశారు.
రైతులకు మరిన్ని ప్రయోజనాలు కలిగేలా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. అలాగే తమ డిక్లరేషన్‌లో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ కాళ్ల కింద నేల కదులుతోంది కాబట్టే కాంగ్రెస్‌పై వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలపడుతోందని విషయాన్ని BRS గుర్తించిందని పేర్కొన్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని BRS.. ఇప్పుడు చాలా మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం