AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: పిల్లల ఆధార్ కార్డుల్లో మార్పులు.. యూఐడీఏఐ కీలక అప్డేట్..

యూఐడీఏఐ కీలక మైలురాయి సాధించింది. పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాల అప్‌డేట్ చేసే విషయంలో రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 13 మిలియిన్ల పిల్లల వివరాలను ఉచితంగా అప్డేట్ చేసింది. ఈ మేరకు స్కూళ్లల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసింది యూఐడీఏఐ.

Aadhaar Card: పిల్లల ఆధార్ కార్డుల్లో మార్పులు.. యూఐడీఏఐ కీలక అప్డేట్..
Aadhar Card Update
Venkatrao Lella
|

Updated on: Feb 09, 2026 | 11:40 PM

Share

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆధార్ వివరాల అప్‌డేట్‌ విషయంలో కీలక మైలురాయిని సాధించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్లు నుంచి 15 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల ఆధార్ కార్డులోని బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి. వేలిముద్రలు, ఐరిస్ వంటి వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు చిన్న వయస్సులో ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు పేరు, ఫొటో, డేట్ ఆఫ్ బర్త్, లింగం, చిరునామా వంటి వివరాలు మాత్రమే అందిస్తారు. ఆ వయస్సులో పిల్లల వేలిముద్రలు, ఐరిస్ పూర్తిగా అభివృద్ది చెందవు. దీంతో పిల్లలు కాస్త పెద్దయ్యాక తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

యూఐడీఏఐ రికార్డ్

యూఐడీఏఐ దేశవ్యాప్తంగా పిల్లల బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడంలో ప్రధాన మైలురాయి సాధించింది. దేశంలోని 8,300 స్కూళ్లల్లో 10 మిలియన్లకుపైగా పిల్లల బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసింది. పిల్లల ఆధార్‌ను బలోపేతం చేయడంలో ముఖ్యమైన అడుగ్గా ఇది నిలిచింది. ఆధార్‌ను అప్డేట్ చేసుకోకపోతే పిల్లలు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ప్రభుత్వ ప్రయోజనాలు పొందటంలో ఇబ్బందులతో పాటు నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి పోటీ పరీక్షలకు నమోదు చేసుకోవడంతో అవాంతరాలు రావొచ్చు. దీంతో సెప్టెంబర్ 2025లో స్కూళ్లల్లో ఆధార్ ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. విద్యాశాఖ UDISE+తో యూఐడీఏఐ ఏకీకరణ చేసింది. దీంతో పాఠశాలలు విద్యార్థుల బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ అయ్యాయా.. లేదా చూసుకోవడం సులువయింది.

స్కూళ్లల్లో ప్రత్యేక క్యాంపులు

పిల్లల ఆధార్ వివరాలను అప్డేట్ చేయడానికి స్కూళ్లల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తుున్నారు.  7 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చని అక్టోబర్ 1 నుంచి యూఐడీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. స్కూళ్లలోనే పిల్లల ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునే సౌకర్యం తెచ్చింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లాల్సిన అవసరం తప్పింది. దీంతో ఇప్పటివరకు 13 మిలియన్ల ఆధార్ వివరాలు అప్డేట్ చేశారు.