AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నాలుగు ప్రదేశాలలో మీకు కావలసినంత బంగారం ఉచితంగా లభిస్తుంది..! రెండు మన భారతదేశంలోనే..?

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత తరుణంలో, ప్రపంచంలో ఉచితంగా బంగారం లభించే నదులు ఉన్నాయంటే నమ్ముతారా? అవును, నిజమే! ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా బంగారం లభించే నాలుగు ప్రధాన ప్రాంతాలు ఉండగా, అందులో రెండు మన భారతదేశంలోనే ఉండటం విశేషం. ఇక్కడి స్థానిక ప్రజలు నది ఇసుకను వడపోసి బంగారం సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ అద్భుతమైన బంగారు నదుల గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Jul 15, 2026 | 6:47 PM

Share
మహిళలు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ బంగారాన్ని ఇష్టపడతారు. ఈ మధ్య పురుషులు కూడా బంగారాన్ని వివిధ రకాల ఆభరణాల రూపంలో ఉపయోగిస్తున్నారు. బంగారాన్ని భద్రతకు మూలంగా భావిస్తారు. వ్యవసాయం, వ్యాపారం లేదా వైద్య ఖర్చుల వంటి కష్ట సమయాల్లో బంగారం సహాయపడుతుంది. కొంతమంది పెట్టుబడిగా కూడా బంగారం కొంటారు. అందరూ బంగారం ధర తగ్గాలని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ఉచితంగా దొరుకుతుందని ఎవరికైనా చెబితే ఎవరూ నమ్మరు. కానీ బంగారం ఉచితంగా లభించే ప్రదేశాలు ఉన్నాయి.

1 / 5
ప్రపంచంలో బంగారం ఫ్రీగా లభించే ప్రదేశాలు 4 ఉన్నాయి. వాటిలో రెండు భారతదేశంలో ఉన్నాయి. భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా రెండు ప్రముఖ నదులు ఉన్నాయి. మన దేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలో ప్రవహించే సువర్ణరేఖ నదిలో నిజంగానే బంగారం ప్రవహిస్తుంది. ఇక్కడి స్థానిక ప్రజలు తెల్లవారుజామునే లేచి నది వద్దకు చేరుకుని, ఇసుకను సేకరించి వడపోస్తారు. ఆ ఇసుకలో చిన్న చిన్న బంగారం రేణువులు లభిస్తాయి. అలాగే ఈ సువర్ణరేఖ నది ఉపనది అయిన కర్కరి నది ఇసుకలో కూడా భారీగా బంగారం రేణువులు దొరుకుతాయి. ఈ నదుల్లోని ఇసుకలోకి బంగారం ఎక్కడి నుండి వస్తుంది, వీటి మూలాలు ఎక్కడ ఉన్నాయి అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఇక్కడి గ్రామీణ ప్రజలు ఈ బంగారం రేణువులను సేకరించి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.

2 / 5
విదేశాల్లోనూ బంగారం ఉచితంగా లభించే నదులు రెండు ఉన్నాయి. అందులో కెనడాలోని కిలోడైక్ నది నుండి అత్యధిక మొత్తంలో బంగారం తవ్వబడుతుంది. ఈ నదీ పరివాహక ప్రాంతంలో భారీగా బంగారం మైనింగ్ జరుగుతుంది. ఇది అక్కడ ఎంతో మందికి జీవనోపాధిని అందిస్తోంది.

3 / 5
బంగారం కొనాలంటేనే భయపడిపోయే ఈ రోజుల్లో, నదీ జలాల్లో బంగారం కొట్టుకురావడం నిజంగా ప్రకృతి ప్రసాదించిన వింతే అని చెప్పాలి. ఈ ప్రాంతాల ప్రజలు ఎలాంటి పెట్టుబడి లేకుండా కేవలం శ్రమతోనే బంగారాన్ని ఉచితంగా పొందుతున్నారు. ఇసుకలో కలిసిన బంగారాన్ని వెలికితీయడానికి ప్రజలు నదిలోని ఇసుకను తవ్వుతారు. అయితే, ఈ నదులు ఎక్కడ పుడతాయో ఎవరికీ తెలియదు.

4 / 5
ఇక రెండవది అమెరికాలోని మిస్సోరి నది. 19వ శతాబ్దం మధ్యకాలంలో మాంటానా ప్రాంతంలోని వాగుల్లో మొదట బంగారాన్ని కనుగొన్నారు. ఈ మిస్సోరి నది ఇసుక తిన్నెల్లో ప్రజలు బంగారం కోసం వెతుకుతుంటారు. నదిలో దొరికే బంగారాన్ని అమ్ముకుని ఇక్కడి ప్రజలు బతుకుతున్నారు.19వ శతాబ్దం మధ్యలో మోంటానాలోని ఒక వాగులోని గులకరాళ్లలో మొట్టమొదట బంగారం కనుగొనబడింది.

5 / 5
Follow Us