Opposition Meeting: విందుకు రండి.. ఆప్ సహా విపక్ష పార్టీలకు సోనియా గాంధీ ఆహ్వానం..
ప్రతిపక్ష పార్టీలను విందుకు ఆహ్వానించారు సోనియా గాంధీ. Opposition Party Meeting: కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ సహా 15 విపక్ష పార్టీలను ఈ విందుకు పిలిచారు.
ప్రతిపక్ష పార్టీలకు సోనియా గాంధీ విందుకు ఆహ్వానించారు. ప్రతిపక్ష పార్టీల సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీతో సహా 24 పార్టీలను ఆహ్వానించారు సోనియా. ఈ సమావేశానికి హాజరుకావాలని కాంగ్రెస్ కూడా ఆప్‌కి పిలుపునిచ్చింది. జులై 18న బెంగళూరులో మీటింగ్ ఉంటుందని.. దానికి ఒకరోజు ముందు విందు ఏర్పాటు చేశారు. 2024 లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీపై కలిసి పోటీ చేసేందుకు ప్రతిపక్ష పార్టీలను కూడగట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది. అంతకుముందు, బీహార్ ముఖ్యమంత్రి, JDU చీఫ్ నితీష్ కుమార్ జూన్ 23 న పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశాన్ని పిలిచారు. ఇందులో 15 పార్టీలు పాల్గొన్నాయి.
ఈ పార్టీలకు కూడా ఆహ్వానం పంపబడింది. ఈ సమావేశంలో మరో 8 పార్టీలు కూడా పాల్గొనబోతున్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే), కొంగు దేశ మక్కల్ కట్చి (కేడీఎంకే), విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్‌పీ), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి ) కూడా ఆహ్వానించబడ్డారు.
గత సమావేశం విజయవంతమైందని, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానిస్తూ.. గత సమావేశం విజయవంతమైందని, అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించామని ఖర్గే చెప్పారు. ఇలాంటి చర్చలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని అన్నారు.
అయితే, తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలతోపాటు టీడీపీకి ఆహ్వానం అందిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం