AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : అతడు నా నంబర్ కోసం 20 వేలు ఖర్చు చేశాడు.. కాల్ చేసి పిచ్చి మాటలు .. యంగ్ హీరోయిన్..

ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా ప్రపంచంలో అడుగుపెడుతుంది. కానీ అంతకు ముందే సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ మీకు తెలుసా.. ఆమె తల్లి సైతం తెలుగులో చాలా పాపులర్ నటి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయాణాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ ఆమె జీవితంలో ఎదురైన ఒక అవాంఛిత ఫోన్ కాల్ అనుభవాన్ని కూడా ప్రస్తావిస్తుంది.

Actress : అతడు నా నంబర్ కోసం 20 వేలు ఖర్చు చేశాడు.. కాల్ చేసి పిచ్చి మాటలు .. యంగ్ హీరోయిన్..
Supritha
Rajitha Chanti
|

Updated on: Feb 09, 2026 | 9:54 PM

Share

టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బొమ్మరిల్లు, రెడీ వంటి చిత్రాలతో మంచి పేరు వచ్చింది. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించిన ఆమె.. కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. సురేఖా వాణి ఇప్పుడు తెరపై తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఆమె కుమార్తె సుప్రీత హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఆమె కథానాయికగా తెరకెక్కించిన సినిమా ‘అమరావతికి ఆహ్వానం’. ఈ చిత్రం ఫిబ్రవరి 13న విడుదల కానుంది. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది సుప్రీత. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

సుప్రీత మాట్లాడుతూ.. తన తల్లి సురేఖ వాణికి మళ్లీ చేయాలనే ఆలోచన తనకు ఉందని తెలిపింది. ఈ విషయం అమ్మతో చెప్పాననియయ తానీ ఆమె మాత్రం తన తండ్రి జ్ఞాపకాలతోనే జీవించాలనుకుంటుందట. ఆ ప్లేస్‌లోకి వేరే ఎవరినీ రానివ్వకూడదని భావిస్తోందని తెలిపింది. తనకు కూడా అదే ఆన్సర్ ఇచ్చిందని తెలిపింది. కానీ తాను పెళ్లి చేసుకునేలోపు అయినా అమ్మకు మంచి జీవిత భాగస్వామి దొరికితే బాగుంటుందని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది సుప్రీత. తన తల్లిని బాగా చూసుకునే వ్యక్తి రావాలని.. చాలా హ్యాపీగా ఉండాలని చెప్పుకొచ్చింది.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

అలాగే ఒక తెలియని వ్యక్తి తన నంబర్ సంపాదించాడనికి దాదాపు 20 వేలు ఖర్చు చేశాడని తెలిపింది సుప్రీత. అతడు ప్రతి సారి తనకు కాల్ చేసి పిచ్చి మాటలు మాట్లాడుతూ విసిగించాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుప్రీత చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ‘అమరావతికి ఆహ్వానం’ చిత్రం హారర్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కింది. ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, శివకంఠనేని కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో సుప్రీత ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

Follow Us