Watch Video: సెల్‌ఫోన్ కొట్టేసేందుకు ‘దొంగ’ డ్రామాలు.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన షాకింగ్ దృశ్యాలు
Mobile Theft in CCTV: మంగళగిరిలో సెల్‌ఫోన్ చోరీకి దొంగలు కొత్త డ్రామాలు ఆడుతున్నారు. సీసీటీవీ కెమరాల్లో రికార్డు కావడంతో అసలు విషయం బయటపడింది. బైక్ పై నుండి కింద పడిపోతున్నట్టు నటిస్తూ సాయం చేసేందుకు వెళ్లే వారి సెల్ ఫోన్లు చాకచక్యంగా కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. మంగళగిరి గాలిగోపురం వద్ద భాస్కర్ అనే వ్యక్తి అ మార్గంలో వెళ్తుండగా..
గుంటూరు: మంగళగిరిలో సెల్‌ఫోన్ చోరీకి దొంగలు కొత్త డ్రామాలు ఆడుతున్నారు. సీసీటీవీ కెమరాల్లో రికార్డు కావడంతో అసలు విషయం బయటపడింది. బైక్ పై నుండి కింద పడిపోతున్నట్టు నటిస్తూ సాయం చేసేందుకు వెళ్లే వారి సెల్ ఫోన్లు చాకచక్యంగా కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. మంగళగిరి గాలిగోపురం వద్ద భాస్కర్ అనే వ్యక్తి అ మార్గంలో వెళ్తుండగా బైక్ మీద నుంచి పడిపోతున్నట్టు ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు నటించాడు. సాయం చేయటానికి వెళ్ళిన భాస్కర్ జేబులో ఉన్న సెల్ఫోన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించడంతో అప్రమత్తమైన భాస్కర్.. వారిని పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే వారిద్దరూ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. ఈ వ్యవహారమంతా సిసిటీవీ కెమరాల్లో రికార్డు కావడంతో మంగళగిరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయం పేరుతో మన దృష్టిని మరల్చి మొబైల్ ఫోన్ చోరీకి పాల్పడుతున్న ఈ కేటుగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.ఇటీవల పెదకాకానిలోనూ ఇదే తరహాలో చోరికి ప్రయత్నించారు కొందరు దొంగలు. రెండు బృందాల్లో ఒకరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..