‘అవకాశం వస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా..’ మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు

టీం ఇండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు తాజాగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. తన ఆటతీరుతో మైదానంలోనే కాకుండా బయట కూడా బోలెడంత పాపులారిటీ దక్కించుకున్న ఈ తెలుగింటి కుర్రాడు అవకాశం ఇస్తే రాజకీయాల్లోకి..

'అవకాశం వస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా..' మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు
Ambati Rayudu
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 12, 2023 | 1:41 PM

గుంటూరు: టీం ఇండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు తాజాగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. తన ఆటతీరుతో మైదానంలోనే కాకుండా బయట కూడా బోలెడంత పాపులారిటీ దక్కించుకున్న ఈ తెలుగింటి కుర్రాడు అవకాశం ఇస్తే రాజకీయాల్లోకి వస్తానంటున్నాడు. తాజాగా గుంటూరులోని ఆర్‌ అగ్రహారంలో అంబటి రాయుడు పర్యటించాడు. అక్కడ ఆటో డ్రైవర్లతో కలిసి టీ తాగిన అంబటి రాయుడు.. ఆ తర్వాత వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాడు.

ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ అవకాశం లభిస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. చాలా విషయాలపై తనకు అవగాహన ఉందని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు. గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటన చేయడం ప్రారంభించాడు కూడా. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన గుంటూరు ఆర్‌ అగ్రహారంలో జనాలతో కలియదిరిగాడు. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి 16 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లో అడుగుపెట్టిన అంబటి, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ ఆడి పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్నాడు. 2019లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఇక తాజాగా ఐపీఎల్‌కూ వీడ్కోలు పలికి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.