Video: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిడిల్ ఆర్డర్ తుఫాన్ ఆయేగా.. వీడియోతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడుగా..
Shreyas Iyer Practice Video: మార్చి 2023 నుంచి జట్టుకు దూరంగా ఉన్న 28 ఏళ్ల అయ్యర్ తన శిక్షణను తిరిగి ప్రారంభించాడు. దీంతో రాబోయే సిరీస్‌ల్లో టీమిండియా తరపున ఆడేందుకు ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
Shreyas Iyer Practice Video: నెల రోజుల విరామం తర్వాత డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా తొలి టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు (India Vs West Indies)తో తలపడనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన తర్వాత టీమ్ ఇండియాకు ఇదే తొలి టెస్టు మ్యాచ్. రెండు రెడ్ బాల్ మ్యాచ్‌ల తర్వాత, రోహిత్ శర్మ సేన వెస్టిండీస్‌తో కరేబియన్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. రాబోయే మ్యాచ్‌లు భారత జట్టుకు, ఆటగాళ్లకు చాలా కీలకమైనవి. మూడు నెలల లోపు టీమ్ ఇండియా ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ (ICC ODI World Cup) ఆడనుంది. అందుకే జట్టులో కీలక ఆటగాళ్లు ఉండటం తప్పనిసరిగా మారింది. గాయాల కారణంగా ఇప్పటికే చాలా మంది స్టార్ ప్లేయర్లు కొన్ని నెలలుగా జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు గాయం నుంచి కోలుకుని ఒక్కొక్కరుగా జట్టులోకి వచ్చేందుకు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
నెట్ వద్ద అయ్యర్ బ్యాటింగ్ ప్రాక్టీస్..
వీరిలో టీమిండియా స్టార్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్, మార్చి 2023 నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. 28 ఏళ్ల అయ్యర్ తన శిక్షణను తిరిగి ప్రారంభించాడు. ఈ మేరకు అయ్యర్ ప్రాక్టీస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయ్యర్ నెట్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం ఈ వీడియోలో చూడవచ్చు.
Good News : 🚨🚨
Mr ODI #ShreyasIyer is back.. 🔥
Latest reports have claimed that Shreyas Iyer will be 100% fit for the World Cup. He might play in the Asia Cup as well. pic.twitter.com/s7wnqRcOdq
— 🤶 (@hrathod__) July 11, 2023
టీమిండియా తరపున ఇప్పటి వరకు మొత్తం 42 వన్డేలు ఆడిన అయ్యర్ 46.60 సగటుతో 1631 పరుగులు చేశాడు. అలాగే, భారత మిడిల్ ఆర్డర్‌లో కీలక ఆటగాడిగా ఉన్న అయ్యర్ ఫిట్‌గా ఉన్నప్పటికీ వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తరపున నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు.
గాయం కారణంగా జట్టుకు దూరమైన అయ్యర్ ఎప్పుడు జట్టులోకి వస్తాడనేది అధికారికంగా తెలియలేదు. అయితే వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియా తరపున అయ్యర్ కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశాలున్నాయి. వెస్టిండీస్‌తో ఆల్-మ్యాచ్ సిరీస్‌తో పాటు, ఆగస్టులో భారత్ మూడు టీ20ల్లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఆసియాకప్‌లో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో స్వదేశంలో వన్డే సిరీస్ కూడా ఆడనుంది. కాగా, మార్చి నెలలో ఆసీస్‌తో చివరి మ్యాచ్ ఆడిన అయ్యర్.. ప్రపంచకప్‌కు ముందు జరిగే మిగిలిన మ్యాచ్‌ల్లో టీమిండియా తరపున ఆడే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..