IND vs WI Preview: 99వ టెస్ట్‌కు రంగం సిద్ధం.. ఆధిపత్యం ఎవరిదో తెలుసా? హిస్టరీ చూస్తే రోహిత్ సేనకు దిగులే..

IND vs WI Head to Head Records: నేటి నుంచి అంటే జులై 12 నుంచి భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. జులై 12 నుంచి 16 వరకు తొలి టెస్ట్ డొమినికాలో జరగనుంది.

IND vs WI Preview: 99వ టెస్ట్‌కు రంగం సిద్ధం.. ఆధిపత్యం ఎవరిదో తెలుసా? హిస్టరీ చూస్తే రోహిత్ సేనకు దిగులే..
Team India Test
Follow us
Venkata Chari

|

Updated on: Jul 12, 2023 | 6:00 PM

IND vs WI Head to Head In Test: నేటి నుంచి అంటే జులై 12 నుంచి భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. జులై 12 నుంచి 16 వరకు తొలి టెస్ట్ డొమినికాలో జరగనుంది. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు పరాజయం పాలైంది. అయితే, ఇప్పటివరకు భారత్ వర్సెస్ వెస్టిండీస్ టీంల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో ఎవరిది పైచేయిగా నిలిచిందో ఇప్పుడు చూద్దాం..

భారత్ vs వెస్టిండీస్ టెస్టుల్లో ఎవరిది పైచేయి?

ఇప్పటి వరకు భారత్, వెస్టిండీస్ మధ్య 98 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. 22 మ్యాచ్‌ల్లో టీమిండియా, 30 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ గెలిచాయి. ఇరుజట్ల మధ్య మొత్తం 46 టెస్టులు డ్రాగా ముగిశాయి. వెస్టిండీస్‌ జట్టు ఓవరాల్‌ టెస్టులో టీమిండియాపై ఆధిపత్యం చూపించింది.

ఇక స్వదేశంలో లెక్కలు గమనిస్తే.. వెస్టిండీస్‌తో భారత జట్టు మొత్తం 47 టెస్టుల్లో తలపడింది. ఇందులో 13 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. 14 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మొత్తం 20 టెస్టులు డ్రాగా ముగిశాయి.

ఇవి కూడా చదవండి

ఇది కాకుండా టీమిండియా తమ గడ్డపై వెస్టిండీస్‌తో మొత్తం 51 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, అందులో భారత్ 9 గెలిచి 16 మ్యాచ్‌ల్లో ఓడింది. అదే సమయంలో 26 టెస్టులు డ్రాగా ముగిశాయి.

ఇరుజట్ల మధ్య చివరి టెస్టు ఎప్పుడు జరిగిందంటే?

చివరిసారిగా ఇరుజట్లు 2019లో 2 టెస్టుల సిరీస్ ఆడాయి. వెస్టిండీస్‌లో జరిగిన ఈ సిరీస్‌లో భారత్ 2-0తో ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు 318 పరుగుల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో 257 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ భారత సారథిగా వ్యవహరించాడు.

టీమిండియా..

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, ముఖేష్ కుమార్ , మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ , శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్.

వెస్టిండీస్..

క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జాషువా డా సిల్వా (వికెట్-కీపర్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అతానాగే, అల్జారీ జోసెఫ్, రహ్కీమ్ కార్న్‌వాల్, షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, రేమాన్ రీఫర్, కెమర్ రోచ్, టాగెనరైన్ మెక్‌కెన్‌పాల్ జోమెల్ వారికన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!