IND vs WI 1st Test Live Streaming: నేటి నుంచే భారత్ vs వెస్టిండీస్ తొలి టెస్ట్.. ఉచితంగా ఎక్కడ చూడాలో తెలుసా?
IND vs WI Test Live Streaming: భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ జులై 12 నుంచి ప్రారంభమవుతుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో మొదటి టెస్టు డొమినికా వేదికగా నేటి నుంచి మొదలుకానుంది. జులై 12 నుంచి జులై 16 వరకు తొలి టెస్ట్ జరగనుంది.
IND vs WI 1st Test Live Streaming and Telecast: భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ జులై 12 నుంచి ప్రారంభమవుతుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో మొదటి టెస్టు డొమినికా వేదికగా నేటి నుంచి మొదలుకానుంది. జులై 12 నుంచి జులై 16 వరకు తొలి టెస్ట్ జరగనుంది. విండీస్‌తో తొలి మ్యాచ్ ద్వారా టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌ను మొదలుపెట్టనుంది. ఇది సైకిల్‌లో మొదటి మ్యాచ్ అవుతుంది. భారత్ vs వెస్టిండీస్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌ను భారతదేశంలో ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రత్యక్షంగా చూడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్‌లో మ్యాచ్ ప్రారంభమయ్యే సమయం?
నేటి నుంచి అంటే జులై 12 నుంచి భారత్ వర్సెస్ విండీస్ మధ్య జరగనున్న ఈ టెస్ట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ మ్యాచ్ వెస్టిండీస్‌లో ఎక్కడ జరుగుతుంది?
భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ డొమినికాలోని రోసోలోని విండ్సర్ పార్క్‌లో జరగనుంది.
ఏ ఛానల్‌లో చూడొచ్చు?
భారత్ vs వెస్టిండీస్‌ల మధ్య జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ భారతదేశంలో దూరదర్శన్ (DD Sports) ద్వారా లైవ్ చూడొచ్చు.
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి?
భారత్ vs వెస్టిండీస్ తొలి టెస్ట్ లైవ్ స్ట్రీమింగ్ ఫ్యాన్ కోడ్, జియోసినిమా యాప్‌లో చూడొచ్చు.
భారత్ vs వెస్టిండీస్ గణాంకాలు..
ఇరుజట్ల మధ్య మొత్తం 98 టెస్టు మ్యాచ్‌లు ఇప్పటి వరకు జరిగాయి. ఇందులో టీమిండియా 22 మ్యాచ్‌ల్లో, వెస్టిండీస్ 30 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. కాగా, 46 టెస్టులు డ్రాగా ముగిశాయి.
భారత టెస్ట్ స్క్వాడ్..
రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్,అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ,ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ముఖేష్ కుమార్ , అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
వెస్టిండీస్ టెస్ట్ స్క్వాడ్..
క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), జాసన్ హోల్డర్, జాషువా డా సిల్వా (వికెట్-కీపర్), రటాగెనరైన్ మెక్‌కెన్‌పాల్ జోమెల్ వారికన్షానన్ గాబ్రియేల్, అలిక్ అతానాగే, అల్జారీ జోసెఫ్, రేమాన్ రీఫర్, కెమర్ రోచ్, హ్కీమ్ కార్న్‌వాల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..