AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీల్‌పై డిష్యూం డిష్యూం! భారత్-అమెరికా ఒప్పందం..అధికార-విపక్షం మధ్య వాగ్వాదం

రియాలిటీ ఏంటంటే.. భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌లో కొన్ని విషయాలపై నోటిమాటగా అంగీకారం కుదిరినా.. ఒప్పందంపై సంతకాల దాకా వెళ్లలేదు. బహుశా వచ్చే వారంలో ఒక క్లారిటీ రావొచ్చు. ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్న వ్యవసాయ ఉత్పత్తులు, పాలు, పాల ఉత్పత్తులపై క్లారిటీ వచ్చినట్టే. పీయూష్ గోయల్ స్టేట్‌మెంట్ ప్రకారం.. వ్యవసాయ, పాలు, పాల ఉత్పత్తులని అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇవన్నీ ఓకే గానీ.. ఇంతకీ డీల్‌తో జరిగే లాభాలేంటి?

డీల్‌పై డిష్యూం డిష్యూం! భారత్-అమెరికా ఒప్పందం..అధికార-విపక్షం మధ్య వాగ్వాదం
39
Jyothi Gadda
|

Updated on: Feb 09, 2026 | 9:58 PM

Share

భారత్-అమెరికా ఒప్పందంపై ఇంకా సంతకాలే జరగలేదు. భారత్–అమెరికా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన మధ్యంతర ముసాయిదాపై ఫ్రేమ్‌వర్క్ మాత్రమే రెడీ అయింది. వాళ్లకేం కావాలో అమెరికా చెప్పింది, భారత్‌కు ఏం కావాలో కేంద్రం లిస్ట్ ఇచ్చింది. ఫ్రేమ్ వర్క్ ఇద్దరికీ నచ్చితే.. అప్పుడు వచ్చే మార్చిలో సంతకాలు జరుగుతాయి. అంతదాకా ఈ మధ్యంతర ఒప్పందం అమల్లోకి రాదు. బట్.. ఇంతలోనే విపక్షాల్లో ఆందోళన కనిపిస్తోంది. రైతు సంఘాలు, కార్మికుల నుంచి వ్యతిరేకత వస్తోంది. కేంద్రం కూడా ప్రతి విమర్శకు, ప్రతి అనుమానానికి సమాధానం ఇవ్వాల్సి వస్తోంది. ఇంత గొడవ దేనికి? నేరుగా మ్యాటర్‌లోకి వస్తే.. భారత్- అమెరికా ట్రేడ్ డీల్‌లో భారత్ ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తొలగిస్తున్నట్లు కొన్ని కథనాలు వచ్చాయ్. అంతే.. దీనిపై రైతు సంఘాలు నిరసన తెలిపాయి. రైతుల్లో ఈ అనుమానాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ సంధించిన ప్రశ్నలు కూడా కారణమే. అమెరికాతో ఒప్పందంలో భాగంగా.. వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన సరుకులను భారత్ దిగుమతి చేసుకోవాలి. అంటే.. ఇప్పుడు జరుగుతున్న దిగుమతులకు దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఇప్పటిదాకా ఏటా అమెరికా నుంచి 40 నుంచి 42 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరుగుతున్నాయి. కాని, ఇక నుంచి ఏడాదికి 100 బిలియన్ డాలర్ల దిగుమతులు చేయాలి. అంతలా అమెరికా నుంచి ఏం కొంటాం అనేది ఇప్పటికీ ప్రశ్నే అనేది కాంగ్రెస్...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి